HomeజాతీయంSemiconductor Museum | దేశంలోనే తొలి సెమి కండక్టర్​ ఇన్నోవేషన్ మ్యూజియం మన హైదరాబాద్​లో.. ఉపయోగాలు...

Semiconductor Museum | దేశంలోనే తొలి సెమి కండక్టర్​ ఇన్నోవేషన్ మ్యూజియం మన హైదరాబాద్​లో.. ఉపయోగాలు ఏమిటంటే..

Semiconductor Museum | భారత్​ సెమీకండక్టర్ రంగంలో చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కారించబడుతోంది. టీ-చిప్ (టెక్నాలజీ చిప్ ఇన్నోవేషన్ ప్రోగ్రామ్) అందుబాటులోకి వస్తోంది.

- Advertisement -

అక్షరటుడే, హైదరాబాద్​: Semiconductor Museum | భారత్​ సెమీకండక్టర్ రంగం (semiconductor sector) లో చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కారం కాబోతోంది. టీ-చిప్ (టెక్నాలజీ చిప్ ఇన్నోవేషన్ ప్రోగ్రామ్)(Technology Chip Innovation Program)  అందుబాటులోకి రాబోతోంది.

దేశంలోనే తొలి సెమీ కండక్టర్ ఇన్నోవేషన్ మ్యూజియం ప్రారంభానికి సిద్ధం కాబోతోంది. హైదరాబాద్​లో నేడు (అక్టోబరు 12) తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డి దీనిని ప్రారంభించనున్నారు.

గ్రేటర్​ హైదరాబాద్​ (Greater Hyderabad) లో 10 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఈ కేంద్రం ఇన్నోవేషన్ హబ్​గా ఉంటుంది. ఇక్కడ ప్రతి నెల కొత్త ఆవిష్కరణలు ఆవిష్కరించబడతాయి.

Semiconductor Museum | 30 డేస్ ఇన్నోవేషన్ మోడల్

ఈ కేంద్రంలో టీ-చిప్ “30 డేస్ ఇన్నోవేషన్ మోడల్” (30 Days Innovation Model) రూపొందించింది. అంటే పరిశోధనా సంస్థలు, స్టార్టప్స్, విశ్వవిద్యాలయాలు, ప్రపంచ టెక్ కంపెనీలు తమ చిప్ ఆవిష్కరణలను నెల రోజులపాటు ఇక్కడ ప్రదర్శించే వెసులుబాటు కల్పించింది.

చిప్ డెమో డే..

టీ-చిప్ కేంద్రంలో ప్రతి నెల చివరలో “చిప్ డెమో డే” (Chip Demo Day) జరుపుతారు. ఇందులో ఇన్నోవేటర్స్ తమ ఆవిష్కరణలను ఇంక్యుబేటర్లు, వెంచర్ క్యాపిటలిస్టులు, ప్రభుత్వ సంస్థల ఎదుట ప్రదర్శించే అవకాశం కల్పిస్తారు. తద్వారా భాగస్వామ్య ‘అవకాశాలు, పెట్టుబడులను పొందే వీలు ఉంటుంది.

ప్రపంచ స్థాయిలో జ్ఞాన మార్పిడి జరిగేందుకు ఇక్కడ ప్రత్యేక గ్లోబల్ ఇన్నోవేషన్ జోన్లు సైతం ఏర్పాటు చేస్తున్నారు. వీటిలో జపాన్ Japan, తైవాన్ Taiwan, యూఎస్​ US వంటి దేశాల నుంచి వచ్చిన లేటెస్ట్ చిప్ టెక్నాలజీలను ప్రదర్శిస్తారు.

ప్రస్తుతం హైదరాబాద్​లో ఏర్పాటు చేసిన ఈ ఇన్నోవేషన్ మ్యూజియంను దేశ వ్యాప్తంగా విస్తరించేందుకు టీ-చిప్ ప్రణాళికలు రూపొందించింది.

Semiconductor Museum | మొదటి ప్రదర్శనలో ప్రత్యేక ఆకర్షణలు..

మొదటి ప్రదర్శనలో ఐఐటీ IIT హైదరాబాద్ అభివద్ధి చేసిన దేశంలోనే తొలి స్వదేశీ ఏఐ చిప్, రోబోటిక్ పెట్స్, హ్యూమనాయిడ్ రోబోలు, ఆధునిక ఈవీ బ్యాటరీ టెక్నాలజీలు, ట్రాన్స్​ఫర్మెంట్​ డిస్​ప్లే తదితర సృజనాత్మక ఆవిష్కరణలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి.

చిప్​ సృష్టికర్త భారత్​..

ఈ సందర్బంగా టీ-చిప్ ఛైర్మన్​ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ సందీప్ కుమార్ మక్తాల మాట్లాడారు. ఇది కేవలం మ్యూజియం మాత్రమే కాదని, భవిష్యత్తు టెక్నాలజీని ఈరోజే చూసే ద్వారమని పేర్కొన్నారు.

పరిశ్రమలు, విద్యార్థులు, పెట్టుబడిదారులు, ప్రభుత్వాలు.. ఒకే వేదికపై కలుసుకునే అవకాశమని వర్ణించారు. భారత్​న్​ చిప్ వినియోగదారునిగా కాకుండా, చిప్ సష్టికర్తగా నిలబెట్టే ఒక కీలకమైన అడుగు అని పేర్కొన్నారు.