అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Arms Dealer Arrest | దేశంలోనే అతిపెద్ద ఆయుధ సరఫరాదారును ఢిల్లీ పోలీసులు (Delhi Police) ఎట్టకేలకు అరెస్టు చేశారు. షేక్ సలీం అలియాస్ సలీం పిస్టల్‌ను (Sheikh Salim alias Salim Pistol) నేపాల్‌లో అరెస్టు చేసినట్లు అధికారులు శనివారం తెలిపారు. చాలా కాలంగా తప్పించుకు తిరుగుతున్న సలీం కదలికలు నేపాల్‌లో ఉన్నట్లు సమాచారం అందడంతో భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు. నేపాల్ అధికారులతో కలిసి జాయింట్ ఆపరేషన్ చేపట్టిన ఢిల్లీ పోలీసుల ప్రత్యేక బృందం ఎట్టకేలకు సలీంను పట్టుకుంది.
Arms Dealer Arrest | ఐఎస్ఐతో సంబంధాలు
ఢిల్లీలోని సీలంపురి నివాసి అయిన సలీం దేశంలోనే అతిపెద్ద ఆయుధ డీలర్‌గా ఎదిగాడు. పాకిస్తాన్ (Pakistan) నుంచి అక్రమ మార్గంలో ఆయుధాలు రవాణా చేయడంలో కీలకంగా మారాడు. అతనికి పాకిస్తాన్ ఇంటర్-సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (Pakistan Inter-Services Intelligence), దావూద్ ఇబ్రహీం D-కంపెనీతో కూడా సంబంధాలు ఉన్నాయి. చాలాకాలంగా తప్పించుకు తిరుగుతున్న సలీంను అరెస్టు చేసిన ఢిల్లీ పోలీసులు.. ఐఎస్ ఐ, D-కంపెనీతో అతనికున్న సంబంధాల గురించి ఏజెన్సీలు దర్యాప్తు చేస్తున్నాయి.
Arms Dealer Arrest | మూసేవాలా, సిద్దిఖి హత్య కేసుల్లో..
లారెన్స్ బిష్ణోయ్ (Lawrence Bishnoi). హషీం బాబా వంటి గ్యాంగ్‌స్టర్లకు ఆయుధాలను అందించడంలో సలీం పాల్గొన్నాడని పోలీసులు భావిస్తున్నారు. ప్రముఖ గాయకుడు శుభదీప్ సింగ్ సిద్ధు అలియాస్ సిద్ధు మూసేవాలా హత్యలో పాల్గొన్న నిందితులలో ఒకరికి సలీం మార్గదర్శకత్వం చేశాడు. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సీపీ) నాయకుడు బాబా సిద్ధిఖీ హత్యలో కూడా అతను పాల్గొన్నట్లు అనుమానిస్తున్నారు.
Arms Dealer Arrest | అజ్ఞాతవాసంలో..
2018లో ఢిల్లీ పోలీసులు (Delhi Police) సలీంను పట్టుకున్నారు, కానీ అతను తప్పించుకున్నాడు. అప్పటి నుండి భద్రతా దళాల కళ్లు గప్పి తప్పించుకు తిరుగుతున్న అతడు అజ్ఞాత వాసం గడుపుతున్నాడు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఎనిమిదో తరగతి తర్వాత చదువులోనే మానేసిన సలీంకు ఐదుగురు సోదరులు ఉన్నారు. అతనికి 1992లో వివాహం జరిగింది. ఇద్దరు పిల్లలు. 2000లో కారు చోరీకి పాల్పడడంతో అతడి నేర చరిత్ర ప్రారంభమైంది. కొంతకాలం డ్రైవర్‌గా పనిచేసిన సలీం 2011లో ఢిల్లీలోని జాఫ్రాబాద్‌లో జరిగిన సాయుధ దోపిడీకి పాల్పడి రూ. 20 లక్షలతో పరారయ్యాడు.