ePaper
More
    Homeజిల్లాలుకామారెడ్డిBhiknoor | పల్లెలు పచ్చగా ఉంటేనే దేశం బాగుంటుంది: గోరటి వెంకన్న

    Bhiknoor | పల్లెలు పచ్చగా ఉంటేనే దేశం బాగుంటుంది: గోరటి వెంకన్న

    Published on

    అక్షరటుడే, భిక్కనూరు: Bhiknoor | పల్లెలు పచ్చగా ఉంటేనే దేశం బాగుంటుందని ప్రజాకవి గోరటి వెంకన్న (Prajakavi Gorati Venkanna) అన్నారు. ఆయన భిక్కనూరు మండలం లక్ష్మీదేవుపల్లిలో కొత్త ఎల్లయ్య జ్ఞాపకార్థం నిర్మించిన బస్టాండ్​ను ప్రారంభించారు.

    అనంతరం నిర్వహించిన సభలో గోరటి వెంకన్న మాట్లాడుతూ ప్రపంచంలో రైతులను మించిన వాళ్లు లేరని పేర్కొన్నారు. ఎవరూ ఏ వృత్తిలో ఉన్నా, ఎంత గొప్ప ఆవిష్కరణలు చేసినా.. రైతు పంటలు పండిస్తేనే మన మనగడ ఉంటుందని తెలిపారు. పల్లెల్లో ఎన్నికల సమయంలోనే రాజకీయాలు ఉండాలని అన్నారు. అనంతరం అందరూ ఒక్కటిగా కలిసి జీవించాలని సూచించారు. అప్పుడే అన్ని సాధించుకోగలుగుతామని వివరించారు. పల్లెలు పచ్చగా ఉంటేనే.. పట్టణాలు, దేశం బాగుంటాయన్నారు. పల్లె సీమలను ప్రతిఒక్కరూ గౌరవించాలన్నారు.

    Bhiknoor | ఉచిత విద్య, వైద్యం అందించాలి

    ప్రజలకు ప్రభుత్వం ఉచిత విద్య, వైద్యం (Free education and healthcare) అందించాలని గోరటి వెంకన్న కోరారు. ఈ విషయమై ప్రభుత్వ పెద్దలను సైతం కలిసి విజ్ఞప్తి చేస్తానని వివరించారు. ఈ సందర్భంగా పలు జానపద గేయాలు ఆలపించారు. కార్యక్రమంలో పీఆర్​టీయూ రాష్ట్ర మాజీ అసోసియేట్​ అధ్యక్షుడు ఏనుగు రాంరెడ్డి, బార్​ అసోసియేషన్​ అధ్యక్షుడు నంద రమేశ్​, నాయ్యవాది క్యాతం సిద్ధిరాములు, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్​.వెంకట్​ రాములు, సీపీఎం నేతలు చంద్రశేఖర్​, కొత్త నర్సింలు, ఇతర పార్టీల నాయకులు నరేందర్​రెడ్డి, హన్మంత్​ నర్సారెడ్డి, నర్సింలు, సిద్ధరాములు, వీడీసీ అధ్యక్షుడు పరమేశ్వర్​ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

    Latest articles

    Gold rates on august 17 | మ‌రింత త‌గ్గిన బంగారం ధ‌ర‌.. వెండి ప‌రిస్థితి ఏమిటంటే..

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌:  Gold rates on august 17 : భారతదేశంలో బంగారానికి Gold ఎప్పుడు డిమాండ్ ఉంటుంది....

    Today Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    Today Panchangam : తేదీ(DATE) – 17 ఆగస్టు​ 2025 శ్రీ విశ్వావసు నామ సంవత్సరం(Sri Vishwavasu Nama Sasra) విక్రమ సంవత్సరం(Vikrama...

    Professor Limbadri | తెలంగాణ ఉన్నత విద్య మండలి మాజీ ఛైర్మన్ లింబాద్రికి మాతృవియోగం

    అక్షరటుడే, నిజామాబాద్ : Professor Limbadri : తెలంగాణ ఉన్నత విద్యా మండలి మాజీ ఛైర్మన్ ప్రొఫెసర్ రిక్క...

    film industry bandh issue | చిరంజీవి చెంతకు సినీ పరిశ్రమ బంద్‌ వ్యవహారం

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: film industry bandh issue : సినీ పరిశ్రమ బంద్‌ వ్యవహారం చిరంజీవి దగ్గరకు చేరింది....

    More like this