అక్షరటుడే, బాన్సువాడ: banswada | క్విట్ ఇండియా (Quit India) ఉద్యమ స్ఫూర్తితో మోదీ కార్పొరేట్ (PM Modi) ప్రభుత్వాన్ని భారతీయులు తరిమి కొట్టి దేశాన్ని రక్షించుకోవాలని సీపీఎం(CPM) ఏరియా కార్యదర్శి నన్నేసాబ్ పిలుపునిచ్చారు. సీఐటీయూ (CITU), ఏఐకేఎస్ (AIKS), ఏఐఎడబ్ల్యూ (AIW), కేంద్ర కమిటీల పిలుపు మేరకు బుధవారం వర్నిలో ‘కార్పొరేట్ కో హటావో దేశ్ కో బచావో’ నినాదంతో బైక్ ర్యాలీ నిర్వహించారు.
కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన చేపట్టారు. అనంతరం సుభాష్ చంద్రబోస్ చౌరస్తా వద్ద నన్నేసాబ్ మీడియాతో మాట్లాడారు. మోదీ ప్రభుత్వం దేశ సంపదను కార్పొరేట్ శక్తులకు అప్పజెప్పిందని మండిపడ్డారు.
దేశాన్ని, దేశ సంపదను కాపాడుకునే బాధ్యత ప్రతి భారతీయుడిపై ఉందని ఆయన అన్నారు. మోదీ పద్ధతి మార్చుకోకపోతే ప్రజలు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. కార్యక్రమంలో లక్ష్మణ్, రవీందర్, సాయిలు, శ్రీనివాస్, మారయ్య, భూమయ్య, గంగారాం తదితరులు పాల్గొన్నారు.