Rotary Club
Rotary Club | కార్గిల్​ అమరవీరుల త్యాగం వెలకట్టలేనిది..

అక్షరటుడే, ఇందూరు: Rotary Club | కార్గిల్​ అమరవీరుల త్యాగాన్ని వెలకట్టలేమని రోటరీ క్లబ్ నిజామాబాద్ మాజీ అధ్యక్షుడు అశోక్ అన్నారు. కార్గిల్ దివస్​ను (Kargil Day) పురస్కరించుకొని శనివారం నగరంలోని బర్కత్​పురాలో గల క్లబ్ కార్యాలయంలో మాజీ సైనికులకు (Ex servicemen) సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 25 ఏళ్ల క్రితం కార్గిల్​ యుద్ధంలో దేశ సైనికులు విజయఢంకా మోగించి దేశ గౌరవాన్ని ప్రపంచస్థాయిలో నిలిపారన్నారు.

పహల్​గామ్​ ఉగ్రదాడి అనంతరం భారత్​ చేపట్టిన ఆపరేషన్​ సింధూర్​లో భాగంగా సైనికులు అనేక మంది తీవ్రవాదులను మట్టుబెట్టిందని అన్నారు. అనంతరం పదవీ విరమణ పొందిన సైనికులు సాయారెడ్డి, సాంసన్, గంగా ప్రసాద్​లను సన్మానించారు. కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షుడు శ్యాం అగర్వాల్, కార్యదర్శి గోవింద్ జవహర్, కోశాధికారి జుగల్ జాజు, శ్రీనివాసరావు, రామ్మోహన్​ రావు, సతీష్, మోటూరి మురళి, విజయరావు, జితేంద్ర మలాని, రాజ్కుమార్ సుబేదార్ తదితరులు పాల్గొన్నారు.