అక్షరటుడే, ఇందూరు: Mla Dhanpal | నగరంలో నిర్మాణంలో ఉన్న కళాభవన్‌కు నిధులు మంజూరు చేసి పూర్తి చేయాలని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ (Urban MLA Dhanpal Suryanarayana) కోరారు. ఈ మేరకు అసెంబ్లీలో సోమవారం ప్రారంభమైన శీతాకాల సమావేశాల్లో (Assembly sessions) జీరో అవర్‌లో మాట్లాడారు.
Mla Dhanpal | అద్భుతమైన కట్టడం..
నిజామాబాద్ జిల్లా కళలు, కళాకారులకు, సాహిత్యానికి పుట్టినిల్లు అని ఎమ్మెల్యే పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో రూ.116 కోట్లతో కళాభవన్‌ను (KalaBhavan) ప్రారంభించారన్నారు. అయితే రూ.50 కోట్లు నిధులు విడుదల చేయడంతో పనులు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. కాంట్రాక్టర్‌కు బకాయిలు ఉండడం.. అంచనాలు మారడంతో రూ. 70కోట్లకు పైగా పెండింగ్ బిల్లులు ఉన్నాయన్నారు.
Mla Dhanpal | రవీంద్ర భారతి తరహాలో..
హైదరాబాద్‌లోని రవీంద్రభారతి (Ravindra Bharathi) తరహాలో ఇందూరు నగరంలో కళాభారతి నిర్మాణం జరుగుతోందని ధన్పాల్ వివరించారు. కానీ దాదాపుగా నాలుగైదేళ్లుగా నిధులు లేక నిర్మాణం మధ్యలోనే నిలిచిపోయిందన్నారు. వెంటనే కళాభవన్ నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని సంబంధిత శాఖమంత్రిని కోరారు.