అక్షరటుడే, వెబ్‌డెస్క్: Excise Constable Funeral | విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య అంత్యక్రియలు ముగిశాయి. స్వగ్రామమైన మోస్రాలో ఆదివారం అంత్యక్రియలు నిర్వహించారు.
ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు (Jupally Krishna Rao), ప్రభుత్వ సలహాదారు, ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి (MLA Sudarshan Reddy), ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఉర్దూ అకాడమీ ఛైర్మన్ తాహెర్‌బిన్ హందాన్, ఎక్సైజ్ శాఖ (Excise Department) ఉన్నతాధికారులు హాజరై నివాళులర్పించారు. సౌమ్య కుటుంబ సభ్యులను ఓదార్చారు. అనంతరం అధికారిక లాంఛనాలతో సౌమ్య అంత్యక్రియలు నిర్వహించారు. అంతిమయాత్రకు ఎక్సైజ్ సిబ్బందితో పాటు గ్రామస్థులు భారీగా తరలివచ్చారు.
Excise Constable Funeral | సౌమ్య కుటుంబానికి రూ.కోటి ఆర్థిక సాయం
ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య కుటుంబానికి ప్రభుత్వం ఆర్థిక సాయం ప్రకటించిన విషయం తెలిసిందే. రూ. కోటి ఎక్స్‌గ్రేషియాతో పాటు ఆమె కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామని మంత్రి జూపల్లి ప్రకటించారు. విధి నిర్వహణలో సౌమ్య ప్రాణాలు కోల్పోవడం బాధాకరమన్నారు. ఆమె కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని పేర్కొన్నారు. ఎక్సైజ్ పోలీసు (Excise Police)లకు ఆయుధాలు సమకూర్చుతామని తెలిపారు.
