అక్షరటుడే, ఎల్లారెడ్డి: Lingampet Mandal | కాంగ్రెస్ నాయకులు మోసపూరిత వైఖరిని విడిచిపెట్టాలని బీజేపీ (bjp lingampet) లింగంపేట మండల అధ్యక్షుడు బొల్లారం క్రాంతి కుమార్ అన్నారు. ఈ మేరకు మండల కేంద్రంలో ఆదివారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు.
Lingampet Mandal | కాంగ్రెస్ ఆఫీస్‌కు పిలిపించుకుని..
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలో గెలిచిన సర్పంచులు కాంగ్రెస్ మద్దతుదారులని పేర్కొనడం సరైంది కాదన్నారు. స్వచ్ఛందంగా గెలిచిన సర్పంచ్‌లను కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి పిలిపించుకుని కండువాలు వేసి తమ పార్టీ మద్దతుదారులని పేర్కొనడం ఎంతవరకు సమంజసం అని వారు ప్రశ్నించారు.
Lingampet Mandal | ఇండిపెండెంట్‌గా గెలిచిన అభ్యర్థిని..
లింగంపేట గ్రామంలో స్వతంత్ర అభ్యర్థి సర్పంచ్‌గా గెలిచారని.. స్థానిక ఎమ్మెల్యే (Mla Madan mohan) ఈ విషయాన్ని గమనించాలని వారు పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో నమ్మకం ఏర్పడాలంటే ఇటీవల కురిసిన వర్షాలకు దెబ్బతిన్న రోడ్లు, ఇళ్లను బాగుచేయించాలన్నారు. నష్టపోయిన రైతులకు నష్టపరిహారం ఇప్పించి ప్రజల అభివృద్ధికి కృషి చేయాలని వారు హితవు పలికారు. కానీ స్వచ్ఛందంగా గెలిచిన సర్పంచ్‌ను కాంగ్రెస్ మద్దతుదారుడని కండువాలు కప్పడం సరైంది కాదని వారు పేర్కొన్నారు.
Lingampet Mandal | ఎంతమంది పేదవారికి ఎమ్మెల్యే నెలజీతం ఇచ్చారు..
ఎమ్మెల్యే తన నెల జీతాన్ని పేదలకు ఇస్తానని మాట ఇచ్చారని.. ఇప్పటివరకు ఎంతమంది పేదలకు పంచారో వివరాలు వెల్లడించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జిల్లా ఓబీసీ మోర్చా (OBC Morcha) మాజీ అధ్యక్షుడు మహారాజుల మురళి, జిల్లా కార్యవర్గ సభ్యులు జక్సాని దత్తు రాములు, మండల ఓబీసీ మోర్చా అధ్యక్షుడు అంధ్యాల ఉద్దేశ్, మండల కిసాన్ మోర్చా అధ్యక్షుడు రాజారాం బాలయ్య, మండల ప్రధాన కార్యదర్శి ఆకుల విష్ణువర్ధన్, సీనియర్ నాయకులు మాజీ సర్పంచ్ వడ్ల ఎల్లేశం, వార్డు సభ్యులు రాజారాం సాయిల్, శివన్న, నవీన్ కుమార్, బొల్లు గణేష్ తదితరులు పాల్గొన్నారు.