అక్షరటుడే నిజామాబాద్ సిటీ: Bjp Nizamabad | కాంగ్రెస్ అంటేనే అవినీతి, స్కామ్‌లతో కూడుకున్న పార్టీ అని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి (BJP District President Dinesh Kulachari) విమర్శించారు. ఈ మేరకు బీజేపీ కార్యాలయంలో గురువారం విలేకరుల సమావేశం నిర్వహించారు.
Bjp Nizamabad | ముట్టడి యత్నాన్ని అడ్డుకున్న బీజేపీ నాయకులు..
కాంగ్రెస్ పార్టీ (Congress party) బీజేపీ కార్యాలయ ముట్టడికి పిలుపునివ్వడంతో.. గురువారం ఉదయమే బీజేపీ నాయకులు పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులను ఆఫీస్ లోపలికి రానివ్వకుండా రోడ్డుపై భైఠాయించారు. అనంతరం విలేకరుల సమావేశంలో దినేష్ మాట్లాడుతూ నరేంద్ర మోదీ ప్రభుత్వం (Narendra Modi government) ప్రజా సంక్షేమానికి అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతూ దేశ ప్రజల మన్ననలు చూరగొంటుందన్నారు. అలాంటి బీజేపీపై ఏమీ చేయలేక చౌకబారు ఆరోపణలు చేస్తూ కాంగ్రెస్ నాయకులు రోడ్లపైకి వస్తున్నారని మండిపడ్డారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రాకముందు నుంచే నేషనల్ హెరాల్డ్ కేసు నడుస్తోందనే విషయాన్ని కాంగ్రెస్ నాయకులు గుర్తించాలని పేర్కొన్నారు.
Bjp Nizamabad | స్కాంల పార్టీ కాంగ్రెస్..
నేషనల్ గేమ్స్, టూ జీ స్కాం లాంటి అనేక కేసుల్లో కాంగ్రెస్ అవినీతి ఇప్పటికే బయటపడిందని దినేష్ పేర్కొన్నారు. దేశంలో రోజురోజుకూ కాంగ్రెస్ పార్టీ మరుగున పడిపోతోందన్నారు. తెలంగాణ ప్రజల ఆవేదన, కేసీఆర్‌పై వ్యతిరేకతతోనే తెలంగాణరాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది తప్పితే మరొకటి కాదని ఆయన వ్యాఖ్యానించారు. హైదరాబాద్ చుట్టూ రూ. 30వేల కోట్ల విలువైన భూమిని దోచుకునేందుకు కాంగ్రెస్ ప్రయత్నాలు చేస్తోందని ఆరోపించారు. రోజురోజుకూ కాంగ్రెస్ గ్రాఫ్ పడిపోతుందని ఆయన పేర్కొన్నారు.
Bjp Nizamabad | స్థానిక సంస్థల్లో 50శాతం దాటలేదు..
అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ పంచాయతీ ఎన్నికల్లో 50శాతం స్థానాలు కూడా దాటలేని దినేష్ కులాచారి పేర్కొన్నారు. రాబోయే ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చిత్తుగా ఓడిపోవడం ఖాయమన్నారు. కాంగ్రెస్ నాయకులు బీజేపీ కార్యాలయాన్ని ముట్టడించడం కాదని.. బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు.
మీడియా సమావేశంలో బీజేపీ నాయకులు న్యాలం రాజు, బొట్టు వెంకటేష్, లక్ష్మీనారాయణ, ఆనంద్, పద్మారెడ్డి, పల్నాటి కార్తీక్, కిషోర్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.