అక్షరటుడే, నిజామాబాద్సిటీ: Nizamabad City | ఉద్యోగాలిప్పిస్తామని చెప్పి యువకులను మోసం చేసిన మహిళను ఎట్టకేలకు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మహిళతో పాటు మరోవ్యక్తిని సైతం పోలీసులు అరెస్ట్ చేశారు.
Nizamabad City | మూడో టౌన్ ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం..
ఈ మేరకు మూడో టౌన్ ఎస్సై హరిబాబు (SI Haribabu) వివరాలు వెల్లడించారు. నగరంలో పలువురు యువకులకు ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించి గొట్టె స్వరూప, కుబేరుడు అనే ఇద్దరు రూ.లక్షల్లో డబ్బులు వసూలు చేశారు. అనంతరం ఉద్యోగాల (Government Jobs) కోసం యువకులు ఒత్తిడి చేయడంతో వారిని ఈ ఇద్దరు వ్యక్తులు బెదిరించారు.
Nizamabad City | ఇంకా ఎవరైనా బాధితులు ఉంటే..
దీంతో బాధితులు మూడో, నాల్గో టౌన్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు మూడో టౌన్ ఎస్సై హరిబాబు మాట్లాడుతూ.. వీరిరువురిపై నాల్గో టౌన్లో రెండు కేసులు, మూడో టౌన్లో మూడు కేసులు నమోదైనట్లు వివరించారు. ఇంకా ఎవరైనా బాధితులు ఉంటే మూడో టౌన్లో ఫిర్యాదు చేయాలని సూచించారు.