అక్షరటుడే, వెబ్డెస్క్ : Inter Exams | ఇంటర్ పరీక్షల పూర్తి షెడ్యూల్ను ఇంటర్ బోర్డు శుక్రవారం వెలువరించింది. ఫిబ్రవరి 25 నుంచి మార్చి 18 వరకు పరీక్షలు జరగనున్నాయి. ఈ మేరకు ఇంటర్ బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య ఉత్తర్వులు జారీ చేశారు.
ఇంటర్ బోర్డు సెక్రెటరీ (Inter Board Secretary) గతంలో పరీక్షల షెడ్యూల్ ప్రకటించారు. అయితే తాజాగా ఏ రోజు ఏ పరీక్ష నిర్వహిస్తారనే వివరాలు వెల్లడించారు. ఈ ఏడాది మొత్తం 9.50 లక్షల మంది విద్యార్థులు ఇంటర్ పరీక్షలు (Inter Exams) రాయనున్నారు. ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి. విద్యార్థులు నవంబర్ 1 నుంచి 11 వరకు పరీక్ష ఫీజు చెల్లించే అవకాశం ఉంది. ఫిబ్రవరి 25 న ఇంటర్ ఫస్టియర్, 26న సెకెండియర్ పరీక్షలు ప్రారంభం అవుతాయి. ఫిబ్రవరి 2 నుంచి ప్రాక్టీకల్ పరీక్షలు (Practical Tests) నిర్వహించనున్నారు.
Inter Exams | పరీక్ష ఫీజు చెల్లింపు వివరాలు
ఇంటర్ తర్వాత వివిధ కోర్సుల్లో చేరే విద్యార్థుల ప్రవేశ పరీక్షలకు ఇబ్బందులు లేకుండా ఈ ఏడాది ముందుగానే ఎగ్జామ్స్ పెడుతున్నారు. దీంతో విద్యార్థులు ఈఏపీసెట్, ఐఐటీ, నీట్ వంటి పరీక్షలకు ప్రిపేర్ కావడానికి సమయం ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. నవంబర్ 11 వరకు ఆన్లైన్ ద్వారా పరీక్ష ఫీజు చెల్లించవచ్చని తెలిపారు. అపరాధ రుసుముతో డిసెంబర్ 15 పరీక్షల ఫీజు చెల్లించే అవకాశం ఉంది.
Inter Exams | సిలబస్లో మార్పులు
వచ్చే విద్యా సంవత్సరం నుంచి సిలబస్లో మార్పులు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. అలాగే ఫస్టియర్లోనూ ల్యాబ్స్, ప్రాక్టికల్ ఎగ్జామ్స్ (Practical Exams)ను పెట్టనున్నట్లు కృష్ణ ఆదిత్య తెలిపారు. ఇంటర్ సిలబస్లో 12 సంవత్సరాల తర్వాత మార్పులు చేస్తున్నట్లు పేర్కొన్నారు. NCERT సబ్జెక్టు కమిటీ సూచనల ప్రకారం మార్పులు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. 40 నుంచి 45 రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తి చేస్తామని తెలిపారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి కొత్తగా ఏసీఈ కోర్సు ప్రవేశ పెడుతున్నట్లు వెల్లడించారు.


