ePaper
More
    Homeబిజినెస్​Nvidia | ఆ కంపెనీ మార్కెట్‌ క్యాప్‌ 4 లక్షల కోట్ల డాలర్లు.. మన దేశ...

    Nvidia | ఆ కంపెనీ మార్కెట్‌ క్యాప్‌ 4 లక్షల కోట్ల డాలర్లు.. మన దేశ జీడీపీ కన్నా ఎక్కువ..

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Nvidia | అమెరికాకు చెందిన ఎన్వీడియా(Nvidia) కంపెనీ రికార్డులు సృష్టిస్తూ ముందుకు సాగుతోంది. ఈ కంపెనీ మార్కెట్‌ క్యాప్‌ విలువ క్రితం Trading సెషన్‌లో 4 లక్షల కోట్ల డాలర్లు దాటింది. 4 లక్షల కోట్ల మార్కెట్‌ క్యాప్‌(Market cap) మార్క్‌ను చేరిన తొలి కంపెనీగా రికార్డు నెలకొల్పింది. అంతకుముందు ఆపిల్‌ 3.91 ట్రిలియన్‌ డాలర్ల మార్కెట్‌ క్యాప్‌తో సృష్టించిన రికార్డును ఇది ఛేదించింది. ఎన్వీడియా స్టాక్‌ విలువ బుధవారం 164.42 డాలర్లకు చేరింది. దీంతో కంపెనీ మార్కెట్‌ క్యాప్‌ 4 ట్రిలియన్‌ డాలర్లకు పెరిగింది. ఆ తర్వాత షేరు ధర 162.88 డాలర్లకు తగ్గడంతో కంపెనీ మార్కెట్‌ విలువ 3.97 ట్రిలియన్‌ (Trillion) డాలర్ల వద్ద నిలిచింది. ఎలక్ట్రికల్‌ ఇంజినీర్‌ అయిన జెన్సెన్‌ హువాంగ్‌ నేతృత్వంలోని ఎన్వీడియా మార్కెట్‌ క్యాప్‌.. భారత్‌(Bharath), ఫ్రాన్స్‌, బ్రిటన్‌ దేశాల జీడీపీ(GDP)కన్నా ఎక్కువ కావడం గమనార్హం.

    Nvidia | నాలుగేళ్లలో 28 నుంచి 162 డాలర్లకు..

    ప్రపంచంలోని ప్రముఖ ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌(Artificial Intelligence) చిప్‌ తయారీ సంస్థ అయిన ఎన్వీడియా ఏఐ విభాగంలో తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఏఐ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ (AI Infrastructure) డిమాండ్‌ కారణంగా బలమైన వృద్ధిని నమోదు చేస్తోంది. ప్రధానంగా ఏఐతో పాటు గేమింగ్‌, డాటా సెంటర్‌(Data center) విభాగాలలో ఆధిపత్యం కొనసాగిస్తోంది.

    ఏఐ, చిప్‌ డిమాండ్‌ ఎక్కువగా ఉండడంతో ఈ కంపెనీ గత నాలుగేళ్లలో అద్భుతమైన ఫలితాలను సాధించింది. నాలుగేళ్లలో ఈస్టాక్‌ ప్రైస్‌ 28 డాలర్లనుంచి 162 డాలర్లకు చేరడం గమనార్హం. 2021లో ఈ కంపెనీ షేరు ధర 28.18 డాలర్ల వద్ద ఉంది. మార్కెట్‌ ఒడిదుడుకులు, టెక్‌ సవాళ్లతో ఆ తర్వాతి సంవత్సరంలో 14.61 డాలర్లకు పడిపోయింది. అయితే ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌పై ఎక్కువగా దృష్టి సారించడంతో కోలుకుంది.

    ఏఐ(AI) ఆధారిత ఉత్పత్తులు, డాటా సెంటర్ల ద్వారా రెవెన్యూ పెరగడంతో స్టాక్‌ పరుగులు తీసింది. ఏడాదిలోనే ఈ స్టాక్‌ ధర 69.33 డాలర్లకు చేరింది. 2024లో 124.65 డాలర్లకు చేరిన ఈ స్టాక్‌ విలువ(Stock price) బుధవారం కొత్త రికార్డు సృష్టించింది. చైనాకు చెందిన డీప్‌సీక్‌తో పోటీ ఉంటుందని అంతా భావించారు. డీప్‌సీక్‌ను తీసుకువచ్చిన తర్వాత ఒక సెషన్‌లో ఎన్వీడియా 600 బిలియన్‌ డాలర్ల మార్కెట్‌ క్యాప్‌ను కోల్పోయింది. అయితే ఆ తర్వాత కోలుకుని బలంగా ముందుకు సాగింది. ఈ ఏడాది ఇప్పటివరకు కంపెనీ షేరు విలువ 21 శాతానికిపైగా పెరగడం గమనార్హం.

    More like this

    Revanth meet Nirmala | కళాశాలల్లో అత్యాధునిక ల్యాబ్​ల ఏర్పాటుకు రూ. 9 వేల కోట్లు..!

    అక్షరటుడే, హైదరాబాద్: Revanth meet Nirmala : తెలంగాణ విద్యా రంగంలో స‌మూల‌ మార్పులు తేవ‌డానికి తాము చేస్తున్న‌...

    Nara Lokesh | కేటీఆర్​ను కలిస్తే తప్పేంటి.. ఏపీ మంత్రి లోకేష్​ కీలక వ్యాఖ్యలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Nara Lokesh | మాజీ మంత్రి, బీఆర్​ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్ (KTR)​ను కలిస్తే...

    Kamareddy | తల్లికి తలకొరివి పెట్టేందుకు కొడుకు వస్తే వెళ్లగొట్టిన గ్రామస్థులు.. ఎందుకో తెలుసా..?

    అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy | తల్లిని కంటికి రెప్పలా కాపాడుకొని ఆసరాగా ఉండాల్సిన కొడుకు ఇరవై ఏళ్ల క్రితం...