90
అక్షరటుడే, ఇందూరు : Panchayat Elections | చివరి విడత ఎన్నికల్లో భాగంగా బుధవారం బాల్కొండ (Balkonda)లో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. పోలింగ్‌కు ఎలాంటి అంతరాయం ఏర్పడకుండా అధికారులు ఏర్పాటు చేశారు. అలాగే ఎన్నికలు జరుగుతున్న కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన నిఘా పెట్టారు.
Panchayat Elections | కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్
బాల్కొండలోని పోలింగ్ కేంద్రాన్ని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి (Collector Vinay Krishna Reddy) ఉదయం పరిశీలించారు. కేంద్రంలోని సౌకర్యాలు, ఓటింగ్ తీరును తెలుసుకున్నారు. ఏదైనా సమస్యలు ఏర్పడితే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలని పీవోలకు సూచించారు. ఓటర్లతో మాట్లాడారు.