అక్షరటుడే, కామారెడ్డి : Collector Kamaredddy | జిల్లా కేంద్రంలోని బాలసదన్ పిల్లలకు కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ (Collector Ashish Sangwan) సర్ప్రైజ్ ఇచ్చారు. అక్కడికి వెళ్లి చిన్నారులతో కలిసి కేక్ కట్ చేసి న్యూ ఇయర్ వేడుకల్లో (New Year Celebrations) పాల్గొన్నారు.
Collector Kamaredddy | పిల్లలకు న్యూఇయర్ విషెస్..
ఈ సందర్భంగా చిన్నారులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం చిన్నారులతో కలసి సహపంక్తి భోజనం చేసి, వారి సంక్షేమానికి జిల్లా యంత్రాంగం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని చెప్పారు. బాలల భవిష్యత్‌ను తీర్చిదిద్దడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా నూతనంగా నిర్మిస్తున్న బాలసదనం భవన నిర్మాణాన్ని పరిశీలించి అన్ని హంగులతో మార్చిలోగా నిర్మాణ పనులు పూర్తి చేయాలని కాంట్రాక్టర్‌ను ఆదేశించారు. కార్యక్రమంలో డిప్యూటీ కలెక్టర్ ట్రెయినీ రవితేజ, డీడబ్ల్యూవో ప్రమీల, జిల్లా బాలల పరిరక్షణ అధికారి స్రవంతి, పంచాయతీరాజ్ అధికారులు, బాలసదనం సిబ్బంది పాల్గొన్నారు.