అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Weather Updates | చలితో వణికిపోతున్న ప్రజలకు వాతావరణ శాఖ అధికారులు (Meteorological Department Officers) వెచ్చని కబురు చెప్పారు. రేపటి నుంచి చలితీవ్రత తగ్గుతుందని తెలిపారు.శీతాకాలం సీజన్ ప్రారంభం అయిన నాటి నుంచి చలి తీవ్రతతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
తెలంగాణ (Telangana) వ్యాప్తంగా నవంబర్ రెండో వారం నుంచే చలి పంజా విసిరింది. మధ్యలో వారం రోజులు మినహా ఇప్పటి వరకు చలి ప్రభావం విపరీతంగా ఉంది. రాత్రిపూట ఉష్ణోగ్రతలు విపరీతంగా పడిపోయాయి. కనిష్ట ఉష్ణోగ్రతలు (Temperatures) సింగిల్ డిజిట్‌కు పరిమితం కావడంతో ప్రజలు అనేక అవస్థలు పడ్డారు. మధ్యాహ్నం సైతం శీతల గాలులు వీచాయి. దీంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వెళ్లాలంటేనే భయపడ్డారు.
Weather Updates | 25 రోజులు..
రాష్ట్రంలో 25 రోజులుగా కోల్డ్ వేవ్ కొనసాగుతోంది. నేటితో కోల్డ్ వేవ్ (Cold Wave) ముగుస్తుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. కొత్త సంవత్సరంలో చలి తీవ్రత తగ్గుతుందని పేర్కొన్నారు. జనవరి 1 నుంచి 6 వరకు సాధారణ ఉష్ణోగ్రతలు నమోదు అవుతాయి. అయితే గాలి నాణ్యత తగ్గుతుంది. శ్వాస సంబంధ వ్యాధులతో బాధ పడుతున్న వారు జాగ్రత్తగా ఉండాలి. తెల్లవారుజామున పొగమంచు కురిసే అవకాశం ఉంది. ఉదయం పూట ప్రయాణాలు చేసే వేరు అప్రమత్తంగా ఉండాలి.
Weather Updates | మళ్లీ చలి అప్పుడే..
జనవరి 8 తర్వాత మళ్లీ ఉష్ణోగ్రతలు పడిపోతాయి. మోస్తరు కోల్డ్‌వేవ్ కొనసాగే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతం ఉన్నంత చలి ఉండదని అధికారులు తెలిపారు. గత పదేళ్లలో ఈ ఏడాది చలి తీవ్రత అధికంగా ఉండటం గమనార్హం.
Weather Updates | పంటలపై ప్రభావం
రాష్ట్ర వ్యాప్తంగా యాసంగి సాగు పనులు జోరుగా సాగుతున్నాయి. పలు జిల్లాల్లో వరి నాట్లు పూర్తి అయ్యాయి. అయితే చలి ప్రభావంతో వరినారు, పొలాలు ఎదగడం లేదు. దీంతో రైతులు (Farmers) ఆందోళన చెందుతున్నారు.