అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Cold Wave | రాష్ట్రంలో చలి పంజా విసురుతోంది. కనిష్ణ ఉష్ణోగ్రతలు (Temperatures) ఎన్నాడు లేనంత పడిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బయటకు వెళ్లాలంటేనే జంకుతున్నారు.
తెలంగాణ (Telangana) వ్యాప్తంగా చలితీవ్రత కొనసాగుతోంది. మధ్యాహ్నం సైతం చలి పెడుతుండటంతో ప్రజలు అనేక అవస్థలు పడుతున్నారు. ప్రస్తుతం యాసంగి సీజన్‌కు సంబంధించిన సాగు పనులు ప్రారంభం అయ్యాయి. ఈ క్రమంలో చలి పెడుతుండటంతో రైతులు, వ్యవసాయ కూలీలు అనారోగ్యం బారిన పడుతున్నారు. చలిగాలులతో చిన్నారులు, వృద్ధులు సైతం వ్యాధులు బారీన పడుతున్నారు.
Cold Wave | మరింత పెరగనున్న చలి
రాష్ట్రంలో చలి తీవ్రత మరింత పెరగనుందని వాతావరణ శాఖ అధికారులు (Meteorological Department Officers) హెచ్చరించారు. పది రోజుల పాటు చలిగాలులు కొనసాగుతున్నాయన్నారు. డిసెంబర్ 18 నుంచి 22 మధ్య జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. ముఖ్యంగా రాత్రి, తెల్లవారుజామున ప్రయాణాలు చేయకపోవడం ఉత్తమం అన్నారు.
Cold Wave | పడిపోయిన ఉష్ణోగ్రతలు
రాష్ట్రంలో రికార్డు స్థాయిలో కనిష్ట ఉష్ణోగ్రతలు పడిపోయాయి. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో గ్రామాలు చలితో వణికిపోతున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్, ఖమ్మం జిల్లాల్లో చలితీవ్రత అధికంగా ఉంది. శుక్రవారం రాత్రి నుంచి శనివారం ఉదయం వరకు పలు జిల్లాల్లో నమోదైన కనిష్ట ఉష్ణోగ్రతలు.. సంగారెడ్డి 6.1, రంగారెడ్డి 6.3, వికారాబాద్ 6.6, ఆసిఫాబాద్ 6.8, మెదక్ 8.2, సిద్దిపేట 8.3, ఆదిలాబాద్ 8.5, కామారెడ్డి 8.6 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. హైదరాబాద్ (Hyderabad) నగరంలో మొయినాబాద్ 6.3, ఇబ్రహీంపట్నం 7.6, హెచ్‌సీయూ 7.5, మౌలాలి 8.1, రాజేంద్రనగర్ 8.9 డిగ్రీల టెంపరేచర్ రికార్డు అయింది.