Homeజిల్లాలుకామారెడ్డిParttime Lecturers | సీఎం మాట నిలబెట్టుకోవాలి..

Parttime Lecturers | సీఎం మాట నిలబెట్టుకోవాలి..

- Advertisement -

అక్షరటుడే, కామారెడ్డి:Parttime Lecturers | ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం పార్ట్​టైం అధ్యాపకులకు(Parttime Lecturers) గుర్తింపునివ్వాలని ఉద్యోగులు డిమాండ్​ చేశారు. తెలంగాణ యూనివర్సిటీ భిక్కనూరు సౌత్ క్యాంపస్(South Campus)​లో పార్ట్ టైం ఉద్యోగుల చేస్తున్న నిరసన గురువారం మూడోరోజుకు చేరింది.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. విశ్వ విద్యాలయాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్ల ఖాళీల భర్తీ కోసం ఇచ్చిన జీవో(GO)ను తక్షణమే సవరించి తమకు ప్రాధాన్యం ఇవ్వాలని డిమాండ్​ చేశారు. నిరసనలో పార్ట్ టైం అధ్యాపకుల అధ్యక్షుడు రమేష్, సునీల్ కుమార్, కనకయ్య, శ్రీను కేతావత్, శ్రీకాంత్ గౌడ్, పోతన, శ్రీకాంత్ పాల్గొన్నారు.