అక్షరటుడే, ఎల్లారెడ్డి : CM Cup Tournament | విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించేందుకు సీఎంకప్ క్రీడా పోటీలు నిర్వహిస్తున్నట్లు ఆర్డీవో పార్థసింహారెడ్డి, డీఎస్పీ శ్రీనివాస్ (DSP Srinivas) అన్నారు. ఈ మేరకు సీఎంకప్ నియోజకవర్గస్థాయి క్రీడలను మంగళవారం ఎల్లారెడ్డి జీవదాన్ పాఠశాలలో (Yellareddy Jeevadan School) ప్రారంభించారు. క్రీడాజ్యోతిని ఆవిష్కరించి.. విద్యార్థులతో క్రీడా ప్రతిజ్ఞ చేయించారు.
CM Cup Tournament | ప్రతిభను వెలికి తీసేందుకు..
నియోజకవర్గంలోని ఎల్లారెడ్డి, నాగిరెడ్డిపేట, లింగంపేట, గాంధారి, తాడ్వాయి, సదాశివనగర్, రామారెడ్డి, రాజంపేట మండలాల జట్లు పాల్గొన్నాయని వక్తలు అన్నారు. విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీసేందుకు ఈ క్రీడలు దోహదపడుతాయని వివరించారు. గ్రామాల్లో ఎంతోమంది ప్రతిభ కలిగిన క్రీడాకారులు ఉన్నారని, వారి ప్రతిభను చాటేలా విద్యార్థులు సీఎంకప్ క్రీడా పోటీలు జరిగాయన్నారు. క్రీడలు యువతకు మానసిక ఉల్లాసంతో పాటు శారీరక ధృడత్వాన్ని అందిస్తాయని పేర్కొన్నారు.
CM Cup Tournament | క్రీడలతో స్నేహభావం..
వివిధ ప్రాంతాల నుంచి వచ్చే క్రీడాకారులతో స్నేహభావం పెంపొందుతుందని ఆర్డీవో పార్థసింహారెడ్డి వారన్నారు. నియోజకవర్గస్థాయిలో గెలుపొందిన జట్లు జిల్లా, రాష్ట్ర, జాతీయస్థాయిలో రాణించి విద్యార్థులు ఎల్లారెడ్డి మండలానికి (Yellareddy Mandal) మంచి గుర్తింపు తీసుకురావాలని ఆకాంక్షించారు. ప్రతిభ కలిగిన క్రీడాకారులకు ప్రభుత్వం తగిన ప్రోత్సాహం ఇస్తుందని తెలిపారు. అనంతరం క్రీడాకారులను పరిచయం చేసుకొని ఫ్రెండ్లీగేమ్ను ప్రారంభించారు. ఇందులో డీఎస్పీ శ్రీనివాస్, ఆర్డీవో పార్థసింహారెడ్డి (RDO Parthasimha Reddy), సీఐ రాజిరెడ్డి, తహశీల్దార్ ప్రేమ్, ఎంఈవో రాజు క్రీడాకారులతో కలిసి ఆడారు. కార్యక్రమంలో ఎంపీడీవో తాహెర బేగం, జీవదాన్ పాఠశాల ప్రిన్సిపాల్ జోబిష్, నియోజకవర్గంలోని పీడీలు, పీఈటీలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.