అక్షరటుడే, కోటగిరి : CM Cup Competitions | గ్రామీణస్థాయి క్రీడాకారులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం (State Government) సీఎం కప్ పోటీలను నిర్వహిస్తోందని సర్పంచ్ కల్లూరి సంధ్య అన్నారు. పోతంగల్ మండల కేంద్రంలోని (Pothangal Mandal) జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గురువారం జ్యోతి ప్రజ్వలన చేసి పోటీలను ప్రారంభించారు.
CM Cup Competitions | గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించాలని..
సీఎం కప్ కార్యక్రమంలో (CM Cup Program) భాగంగా.. మండలంలోని అన్ని గ్రామాల యువకులు వాలీబాల్, కబడ్డీ, ఖోఖో, లాంగ్‌జంప్, యోగా, పోటీలను నిర్వహిస్తామని సర్పంచ్ తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం (Telangana Government) గ్రామీణ ప్రాంత యువత క్రీడల్లో ముందుండాలనే ఉద్దేశంతో సీఎంకప్ పేరుతో పోటీలు నిర్వహిస్తోందన్నారు. క్రీడాకారులు సైతం మెరుగైన ప్రదర్శన ఇచ్చి రాష్ట్ర, జాతీయస్థాయి క్రీడల్లో రాణించాలని ఆమె ఆకాంక్షించారు. ప్రభుత్వం సైతం ఉత్తమ క్రీడాకారులకు ఎల్లప్పుడూ మద్దతు తెలుపుతుందన్నారు.
CM Cup Competitions | జిల్లా నుంచి..
జిల్లా నుంచి బాక్సింగ్ క్రీడాకారిణి అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ చూపుతోందని సర్పంచ్ అన్నారు. హాకీ క్రీడాకారిణి యెండల సౌందర్య సైతం అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ చూపి ప్రస్తుతం కోచ్‌గా వ్యవహరిస్తోందన్నారు. కార్యక్రమంలో ఏఎంసీ ఛైర్మన్ గైక్వాడ్ హన్మంత్, ఎంపీడీవో చందర్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పుప్పాల శంకర్, పంచాయతీ కార్యదర్శి యాదవ్, ఏజాజ్ ఖాన్, గంట్ల విఠల్, సాయాగౌడ్, పాఠశాల ఉపాధ్యాయులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.