HomeతెలంగాణCold Wave | వణికిస్తున్న చలి.. మరింత పడిపోనున్న ఉష్ణోగ్రతలు

Cold Wave | వణికిస్తున్న చలి.. మరింత పడిపోనున్న ఉష్ణోగ్రతలు

రాష్ట్రంలో చలి తీవ్రత పెరుగుతోంది. రానున్న రెండు రోజులు ఉష్ణోగ్రతలు మరింత పడిపోయే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Cold Wave | రాష్ట్రంలో చలి పంజా విసురుతోంది. సీజన్​ ప్రారంభంలోనే చలి గజగజ వణికిస్తోంది. గత వారం రోజుల నుంచి శీతల గాలులు వీయడంతో పాటు, రాత్రి ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

రాష్ట్రంలో మధ్యాహ్నం సైతం చలితో ప్రజలు వణికిపోయే పరిస్థితులు ఉన్నాయి. సాయంత్రం ఆరు అయిందటే చాలు ఇంట్లో నుంచి కాలు బయటపెట్టలేని పరిస్థితి. ఉదయం పది గంటల వరకు చలి అధికంగా ఉంటుంది. దీంతో ప్రజలు అత్యవసరం అయితేనే బయటకు వెళ్తున్నారు. అయితే రానున్న రెండు రోజులు చలితీవ్రత మరింత పెరుగుతుందని వాతావరణ శాఖ (IMD) అధికారులు హెచ్చరించారు. రానున్న 48 గంటలు ఉష్ణోగ్రతలు మరింత పడిపోతాయని ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

Cold Wave | ఉత్తర తెలంగాణలో..

ఉత్తర తెలంగాణలో చలి తీవ్రత అధికంగా ఉంది. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్​ (Adilabad) జిల్లాల్లో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. సోమవారం ఉదయం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో 6-9 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు పడిపోయే అవకాశం ఉంది. హైదరాబాద్​ (Hyderabad) నగరంలో 7-11° ఉష్ణోగ్రతలు నమోదు అవుతాయి.

Cold Wave | కనిష్ట ఉష్ణోగ్రతల వివరాలు

రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఆదివారం ఉదయం సింగిల్​ డిజిట్​ ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ (Sirpur)​లో రికార్డు స్థాయిలో 7.4 డిగ్రీల టెంపరేచర్​ నమోదు కావడం గమనార్హం. సంగారెడ్డి జిల్లా కోహీర్​లో 8.1, హైదరాబాద్​లోని హెచ్​సీయూలో 10 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి.

Must Read
Related News