HomeతెలంగాణThe Child Who Never Knew | 30న ది చైల్డ్ హూ నెవర్ న్యూ...

The Child Who Never Knew | 30న ది చైల్డ్ హూ నెవర్ న్యూ పుస్తకంపై సంభాషణ

అక్షరటుడే, హైదరాబాద్​: The Child Who Never Knew | మధు రంగనాథన్ Madhu Ranganathan రాసిన ది చైల్డ్ హూ నెవర్ న్యూ పుస్తకంపై హైదరాబాద్​ (Hyderabad) లో ఈ నెల 30వ తేదీన సంభాషణ, రచయిత తన ప్రత్యేక అవసరాలు ఉన్న కూతురితో చేసిన ప్రయాణాన్ని ఆవిష్కరించే కార్యక్రమం చేపడుతున్నారు.

మద్రాస్ రీడింగ్ కంపెనీ ఆధ్వర్యంలో గచ్చిబౌలి (Gachibowli) లోని హోటల్ హయత్ (Hotel Hyatt) ​లో మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కార్యక్రమం ఉంటుంది.

మధు రంగనాథన్‌తోపాటు ఈ సంభాషణలో ఉపాసన మహ్తానీ Upasana Mahtani పాల్గొంటారు. ఉపాసన మద్రాస్ రీడింగ్ కంపెనీ (TMRC) వ్యవస్థాపకురాలు, బుక్ రిపోర్టర్, ప్రత్యేక అవసరాలు ఉన్న బిడ్డ తల్లి కావడం గమనార్హం.

ఈ కార్యక్రమాన్ని హైదరాబాద్‌లోని ప్రత్యేక అవసరాల పిల్లల సంరక్షణ సంస్థలను, కుటుంబాలను వెలుగులోకి తీసుకురావడంతోపాటు వారికి మద్దతు, శక్తినిచ్చే దిశగా చేపడుతున్నారు.

The Child Who Never Knew | పుస్తకం గురించి:

ది చైల్డ్ హూ నెవర్ న్యూ అనేది రచయిత మధు రంగనాథన్ కూతురు సితార జీవిత ప్రయాణాన్ని ఆవిష్కరిస్తుంది. ప్రస్తుతం 37 ఏళ్ల వయస్సులో ఉన్న సితారకు ఆమె జన్మించినప్పుడే టోక్సోప్లాస్మోసిస్ వ్యాధి నిర్ధారణ అయింది.

అనేక దివ్యాంగతలు (multiple disabilities), దృష్టి హీనత (visual impairment), తీవ్ర ఆరోగ్య సమస్యలు ఉన్నా.. సితార చూపిన అద్భుతమైన ధైర్యం ఈ పుస్తకంలోని ప్రధాన కథనాంశం.

ఈ పుస్తకం తల్లిదండ్రులు, అమ్మమ్మలు–తాతయ్యలు, మహిళలు, సోదరులు, సంరక్షకులు సమాజంలోని ప్రతి ఒక్కరికి ఒక ప్రేరణ దీపికగా రచయిత పేర్కొంటున్నారు.

ఇది సానుభూతి రగిలించే గొంతుక మాత్రమే కాకుండా, తల్లిగా ఒక visually impaired బిడ్డతో చేసిన ప్రయాణానికి సంబంధించిన మనసును హత్తుకునే నిజమైన కథనం.

ప్రవేశం: ఉచితం (ఈమెయిల్ ద్వారా నమోదు చేసుకోవాలి) themadrasreadingcompany@gmail.com

Must Read
Related News