అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Panchayat Elections | రాష్ట్రంలో మూడు దశల్లో పంచాయతీ ఎన్నికలు జరిగాయి. అధికార కాంగ్రెస్ పార్టీ (Congress Party) మెజారిటీ స్థానాలు కైవసం చేసుకుంది.పంచాయతీ ఎన్నికలపై సీఎం రేవంత్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్, కాంగ్రెస్ రాష్ట్ర ఇన్‌ఛార్జి మీనాక్షి నటరాజన్ (Meenakshi Natarajan) పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) 18 మంది ఎమ్మెల్యేల పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. కాంగ్రెస్ రెబల్స్‌ను బుజ్జగించకపోవడంతో పార్టీ నష్టం జరిగిందని ఆయన పేర్కొన్నారు. అలాగే సొంత బంధువులకు టికెట్ ఇచ్చి పార్టీకి నష్టం చేశారని పీసీసీ గుర్తించింది. ఈ క్రమంలో పలువురిపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు.
Panchayat Elections | పీసీసీ క్లాస్
వరంగల్, మహబూబ్‌నగర్, నల్గొండ జిల్లాల ఎమ్మెల్యేలకు సీఎం, పీసీసీ అధ్యక్షుడు క్లాస్ పీకినట్లు సమాచారం. 18 మంది ఎమ్మెల్యేల తీరుతో పలు గ్రామాల్లో కాంగ్రెస్ ఓడిపోయిందని వారు పేర్కొన్నారు. రెబల్స్‌ను బుజ్జగించడంలో విఫలం అయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు. భవిష్యత్‌లో ఇలాంటివి రిపీట్ కాకుండా చూడాలని సూచించారు. లేదంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Panchayat Elections | కాంగ్రెస్ జోరు
పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మెజారిటీ స్థానాలు గెలిచింది. రాష్ట్రంలో 31 జిల్లాల్లో ఎన్నికలు జరిగాయి. సిద్దిపేట మినహా మిగతా జిల్లాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు మెజారిటీ స్థానాలు కైవసం చేసుకున్నారు. మొత్తం 12,733 పంచాయతీలకు ఎన్నికలు జరగ్గా కాంగ్రెస్ 7,010 స్థానాల్లో గెలిచింది. బీఆర్ఎస్ (BRS) మద్దతుదారులు 3,502 స్థానాలను కైవసం చేసుకున్నారు. అధికార పార్టీ 80శాతంపైగా సీట్లు సాధిస్తుందని ఆశించారు. అయితే ప్రతిపక్ష బీఆర్ఎస్ కూడా గట్టి పోటినిచ్చింది. దీంతో ఓటమికి గల కారణాలపై కాంగ్రెస్ నాయకులు సమీక్షించారు. రానున్న ఎన్నికల్లో పొరపాట్లు జరగకుండా చర్యలు చేపట్టారు.