అక్షరటుడే, వెబ్డెస్క్: Mallikarjun Kharge | కేంద్ర ప్రభుత్వం ప్రజల హక్కులను అణిచివేస్తుందని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే (Mallikarjun Kharge) అన్నారు. కాంగ్రెస్ నిర్మించిన సంస్థలను బలహీనపర్చిందని, రాజ్యాంగం అంటే వారికి గౌరవం లేదన్నారు.
కాంగ్రెస్ వ్యవస్థాప దినోత్సవం (Congress Foundation Day) సందర్భంగా ఖర్గే ఇందిరా భవన్లో (Indira Bhavan) జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం మాట్లాడుతూ.. దేశం కోసం కాంగ్రెస్ కుటుంబం ఎన్నో త్యాగాలు చేసిందన్నారు. కాంగ్రెస్ హయాంలో పేదలకు ఉపయోగపడేలా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు, పథకాలు తీసుకొచ్చినట్లు చెప్పారు. కానీ బీజేపీ బీజేపీ పేదల కడుపు కొట్టేలా వ్యవహరిస్తోందని ఆరోపించారు. గాంధీ ఆశయాలకు అనుగుణంగా కాంగ్రెస్ కార్యకర్తలు నడుచుకోవాలని ఆయన సూచించారు.
Mallikarjun Kharge | కాంగ్రెస్ను అంతం చేయలేరు
ఖర్గే మాట్లాడుతూ, “కాంగ్రెస్ అంతరించిపోయిందని చెప్పేవారికి, నేను స్పష్టంగా చెప్పాలనుకుంటున్నాను. మనం అధికారంలో లేకపోవచ్చు, కానీ మన వెన్నెముక నిటారుగా ఉంటుంది. రాజ్యాంగం, లౌకికవాదం లేదా ప్రజల హక్కులపై మేము రాజీపడలేదు. కాంగ్రెస్ ఎప్పుడూ మతం పేరుతో ఓట్లు అడగలేదు, దేవాలయాలు మరియు మసీదుల పేరుతో ద్వేషాన్ని వ్యాప్తి చేయలేదు. బీజేపీ విభజిస్తుంది, అయితే మనం ఐక్యంగా ఉంటాం.” అన్నారు.
Mallikarjun Kharge | రాజ్యాంగాన్ని కాపాడుతాం
ప్రస్తుతం కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉందని, కానీ నిజాన్ని దాచి పెడుతుందని ఖర్గే వ్యాఖ్యానించారు. జనాభా గణనను నిర్వహించకుండా తప్పించుకుంటుందని, రాజ్యాంగాన్ని మార్చడం గురించి మాట్లాడుతుందని పేర్కొన్నారు. కాంగ్రెస్ ఒక సిద్ధాంతం అని, అది ఎప్పటికీ ముగియదన్నారు. ఈ పోరాటం అధికారం కోసం కాదని, జాతి ఆత్మ కోసం అని తెలిపారు. కాంగ్రెస్ పోరాడకపోతే రాజ్యాంగాన్ని, దేశాన్ని కాపాడతారని ఆయన ప్రశ్నించారు. సమాజాన్ని అభివృద్ధి చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ పని చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ తదితరులు పాల్గొన్నారు.