ePaper
More
    Homeజిల్లాలునిజామాబాద్​Minister Vakiti Srihari | రాష్ట్రంలో యూరియా కొరతకు కేంద్ర ప్రభుత్వమే కారణం..

    Minister Vakiti Srihari | రాష్ట్రంలో యూరియా కొరతకు కేంద్ర ప్రభుత్వమే కారణం..

    Published on

    అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Minister Vakiti Srihari | తెలంగాణ రాష్ట్రంలో యూరియా కొరతకు కేంద్ర ప్రభుత్వమే కారణమని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ, క్రీడలు యువజన సర్వీసుల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి పేర్కొన్నారు. నగరంలోని రూరల్​ క్యాంప్​ కార్యాలయంలో మంత్రి ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు.

    ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రానికి సరిపడినంత యూరియా (Urea) పంపకుండా కేంద్రం తాత్సారం చేస్తోందన్నారు. దీంతో ఇక్కడి రైతులు అవస్థలు పడుతున్నారన్నారు. అయినప్పటికీ రాష్ట్రంలోని బీజేపీ నాయకులకు చీమకుట్టినట్లయినా లేదని ఆయన వ్యాఖ్యానించారు. స్టాక్​ పంపాలని విన్నపాలు చేసినప్పటికీ అడపాదడపా యూరియా పంపుతూ ఇక్కడి రైతులను కేంద్రం ఇబ్బంది పెడుతోందని ఆయన పేర్కొన్నారు.

    Minister Vakiti Srihari | బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చితీరుతాం..

    కామారెడ్డిలో నిర్వహించబోయే సభ ద్వారా మరిన్ని సంక్షేమ పథకాలపై ప్రకటన చేస్తామని మంత్రి తెలిపారు. జనాభా ప్రాతిప్రతిపాదన ప్రకారం రిజర్వేషన్లు ఉండాలనేది రాహుల్ గాంధీ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.

    బీసీలకు 42శాతం రిజర్వేషన్లు ఇచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందన్నారు. బీసీలు బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రాధాన్యమిస్తుందన్నారు. మాట ఇస్తే తప్పని పార్టీ కాంగ్రెస్ అని పేర్కొన్నారు. బీసీ రిజర్వేషన్ బిల్లుకు ఇంకా గవర్నర్ ఆమోదం లభించలేదన్నారు. దీనిపై బీజేపీపై ఒత్తిడి తెస్తున్నట్లు చెప్పారు. రిజర్వేషన్ సాధించాకే ఎన్నికలకు వెళ్తామన్నారు.

    Minister Vakiti Srihari | దేశంలోనే తెలంగాణ రోల్ మోడల్

    దేశంలో తెలంగాణను ఇతర రాష్ట్రాలు రోల్ మోడల్​గా చూస్తున్నాయని మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. దీనికి అనుకూలంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth reddy) సర్కారు పనిచేస్తోందన్నారు. రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు పీసీసీ చీఫ్​ బొమ్మ మహేశ్​కుమార్​, సీఎం రేవంత్​రెడ్డి ఆధ్వర్యంలో ఆహర్నిశలు కృషి చేస్తున్నారన్నారు.

    సమావేశంలో భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు (MLA Gandra Satyanarayana Rao), ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్(MLC Balmuri Venkat), రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి (Rural MLA Bhupathi Reddy), డైరీ ఫాం కార్పొరేషన్ ఛైర్మన్ అమిత్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి (Manala Mohan Reddy), ఉర్దూ అకాడమీ ఛైర్మన్ తాహెర్ బిన్ హందాన్ (Tahir Bin Hamdan)​, గడుగు గంగాధర్(Gadugu Gangadhar), శేఖర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

    More like this

    Mittapally | ముగిసిన జర్నలిస్టు నారాయణ అంత్యక్రియలు

    అక్షరటుడే, డిచ్​పల్లి: Mittapally | గుండెపోటుతో మృతి చెందిన సీనియర్ జర్నలిస్ట్ లక్కవత్రి నారాయణ ( senior journalist...

    Intermediate Education | గాంధారి ప్రభుత్వ జూనియర్​ కళాశాల తనిఖీ

    అక్షరటుడే, గాంధారి : Intermediate Education | మండలంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలను జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి షేక్...

    Fee reimbursement | ఈ నెల 15 నుంచి కాలేజీలు బంద్ చేస్తాం.. యాజమాన్యాల కీలక నిర్ణయం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Fee reimbursement | రాష్ట్రంలోని ప్రైవేట్​ కాలేజీ (Private Colleges)లకు కొంతకాలంగా ప్రభుత్వం ఫీజు...