Labor Codes
Labor Codes | కార్మిక చట్టాలను కాలరాస్తున్న కేంద్ర ప్రభుత్వం

అక్షరటుడే, బాన్సువాడ: Labor Codes | కార్మిక చట్టాలను కేంద్ర ప్రభుత్వం కాలరాస్తోందని ఏఐటీయూసీ (AITUC) జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ దుబాస్ రాములు అన్నారు. మంగళవారం ఏఐటీయూసీ ఆధ్వర్యంలో బాన్సువాడ (Banswada) సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ధర్నా నిర్వహించారు. అనంతరం వివిధ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని కార్యాలయ సిబ్బందికి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కార్మికులు పోరాడి సాధించుకున్న 44 కార్మిక చట్టాలలో 29 కార్మిక చట్టాలను కేంద్ర ప్రభుత్వం సమూలంగా రద్దు చేసిందన్నారు. కార్పోరేట్లు, బడా వ్యాపారులకు అనుకూలంగా నాలుగు లేబర్ కోడ్​లు (Labor Codes) తెచ్చిందన్నారు. వాటిని వెంటనే రద్దు చేయాలని డిమాండ్​ చేశారు. కార్యక్రమంలో తోటపల్లి శ్రీనివాస్, కొత్త సాయిలు, భూమయ్య, గంపల సాయిలు, పుట్టి సాయిలు, హన్మాండ్లు, చిన్న సాయిలు తదితరులు పాల్గొన్నారు.