అక్షరటుడే, ఇందూరు: BJP Nizamabad | ప్రధాని మోదీ (PM Modi) జీఎస్టీపై (GST) తీసుకున్న నిర్ణయం హర్షణీయమని బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగోల్ల లక్ష్మీనారాయణ (Nagolla Lakshminarayana) అన్నారు. ఖిల్లా రాం మందిర్ (Killa Ram Mandir) మండల శాఖ ఆధ్వర్యంలో ప్రధాని నరేంద్ర మోదీ చిత్రపటానికి శుక్రవారం పాలాభిషేకం చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఎన్డీఏ కూటమి తీసుకున్న నిర్ణయంతో మధ్యతరగతి కుటుంబాలకు ఊరట లభిస్తుందన్నారు. దేశాభివృద్ధిలో మోదీ నిర్ణయాలు ఎంతో కీలకంగా మారాయని ఆయన స్పష్టం చేశారు. ప్రపంచ దేశాలు భారత్ వైపు చూస్తున్నాయని పేర్కొన్నారు.
కార్యక్రమంలో మండల అధ్యక్షుడు కోడూరు నాగరాజు, మాజీ కార్పొరేటర్ నారాయణ, మండల ప్రధాన కార్యదర్శులు మఠం పవన్, చిరంజీవి, ఓబీసీ మోర్చా మండలాధ్యక్షుడు మారుతి, శక్తి కేంద్ర ఇన్ఛార్జీలు, పార్టీ కార్యాలయం ఇన్ఛార్జి బద్దంకిషన్, మీడియా సెల్ కన్వీనర్ వీరేందర్, వెంకటరాములు, కిరణ్ రాథోడ్, చంద్రకాంత్, రాజశేఖర్, అనిల్ తదితరులు పాల్గొన్నారు.