ePaper
More
    HomeతెలంగాణKavach Center | తెలంగాణలో మరో కీలక సంస్థ ఏర్పాటు చేయనున్న కేంద్రం

    Kavach Center | తెలంగాణలో మరో కీలక సంస్థ ఏర్పాటు చేయనున్న కేంద్రం

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ :Kavach Center | తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం(Central Government) మరో కీలక సంస్థను మంజూరు చేసింది. రైల్వే భద్రతకు కీలకమైన కవచ్​ సెంటర్​ ఆఫ్​ ఎక్సలెన్సీ కేంద్రాన్ని సికింద్రాబాద్​లో ఏర్పాటు చేయనుంది.

    ఈ మేరకు కేంద్ర మంత్రి కిషన్​రెడ్డి సోషల్ మీడియాలో వివరాలు వెల్లడించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi) నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు మరొక కీలక కేంద్ర పరిశోధన సంస్థను మంజూరు చేసిందని ఆయన పేర్కొన్నారు. రూ.265 కోట్ల వ్యయంతో రైల్వే భద్రత కోసం కవచ్ కేంద్రాన్ని(Kavach Center) సికింద్రాబాద్‌లో ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.

    దేశ రైల్వే భద్రత విషయంలో ప్రపంచ స్థాయి సాంకేతికతను అభివృద్ధి చేయడం, 5G పరీక్ష, నైపుణ్య అభివృద్ధి, స్మార్ట్ రైలు(Smart Train) వ్యవస్థలను రూపొందించడం కవచ్ కేంద్రం ముఖ్య ఉద్దేశాలని ఆయన వివరించారు. దీని ద్వారా సురక్షితమైన రైల్వే రవాణాకు మార్గం సుగమం కానుందన్నారు. మేక్ ఇన్ ఇండియా make in India కింద సురక్షితమైన, ఆత్మనిర్భర రైల్వే నెట్‌వర్క్ సాధన కోసం ఇదొక గొప్ప ముందడుగుగా ఆయన అభివర్ణించారు.

    కేంద్ర ప్రభుత్వం సికింద్రాబాద్​ రైల్వేస్టేషన్(Secunderabad Railway Station)​ను ఇప్పటికే అమృత్​ భారత్​ పథకంలో భాగంగా ఆధునీకరిస్తోంది. ఇందులో భాగంగా దాదాపు రూ.700 కోట్లతో పనులు చేపడుతున్నారు. ప్రస్తుతం పనులు వేగంగా జరగుతున్నాయి. ఆధునికీకరణ పనుల నేపథ్యంలో పలు స్టేషన్ల టెర్మినల్స్​ మార్చిన విషయం తెలిసిందే. ఓ వైపు సికింద్రాబాద్​ రైల్వే స్టేషన్​ను secunderabad railway station ఆధునికీకరిస్తున్న కేంద్రం.. తాజాగా కీలకమైన సంస్థను ఏర్పాటు చేయాలని నిర్ణయించడంపై కిషన్​రెడ్డి(Kishan Reddy) హర్షం వ్యక్తం చేశారు.

    More like this

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...

    Train to halt at Cherlapalli | పండుగల నేపథ్యంలో సౌత్ సెంట్రల్ రైల్వే కీలక నిర్ణయం.. ఆ రైలుకు చర్లపల్లిలో హాల్ట్

    అక్షరటుడే, హైదరాబాద్: Train to halt at Cherlapalli : రానున్న దసరా, దీపావళి, ఛఠ్ పర్వదినాల సీజన్‌ను...