Homeజిల్లాలుకామారెడ్డిKamareddy | కల్లుగీత వృత్తిపై కేంద్రం చిన్నచూపు

Kamareddy | కల్లుగీత వృత్తిపై కేంద్రం చిన్నచూపు

Kamareddy | కల్లుగీత వృత్తిని ప్రభుత్వం ప్రోత్సహించాలని కల్లుగీత సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వెంకటరమణ కోరారు. కామారెడ్డి పట్టణంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.

- Advertisement -

అక్షరటుడే, కామారెడ్డి : Kamareddy | దేశీయ వస్తువులనే వాడాలని చెప్పే కేంద్ర ప్రభుత్వం (Central Government) ప్రకృతి పానీయాలైన నీరా, కల్లును ఎందుకు ప్రోత్సహించడం లేదని కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వెంకటరమణ ప్రశ్నించారు.

పట్టణంలోని ఆర్​ అండ్​బీ గెస్ట్ హౌస్​లో (R&B Guest House) శనివారం గీత కార్మిక సంఘం జిల్లా కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకటరమణ మాట్లాడుతూ.. సాఫ్ట్ డ్రింక్​లను ఉత్పత్తి చేసే బడా కార్పొరేట్ కంపెనీలు రూ. కోట్లల్లో ప్రజల నుండి దండుకుంటున్నాయన్నారు.

ఇన్నేళ్లలో కేంద్రంలోని బీజేపీ సర్కారు ఒక్క పథకమైనా గీత కార్మికుల సంక్షేమానికి ప్రవేశపెట్టిందా అని ప్రశ్నించారు. వారు పెంచిన జీఎస్టీని వారే తగ్గించి ప్రజలను పండుగ చేసుకోండని ప్రధాని (Prime Minister Modi) అంటున్నారని, నిరుపేదలందరికీ ఇంటికి రూ.20 లక్షలు ఇస్తే సంబురంగా పండుగ చేసుకుంటారన్నారు. స్వయం సహాయక సంఘాల సభ్యులను కోటీశ్వరులను చేస్తామంటున్నారని, కల్లుగీత సొసైటీ సభ్యుల గురించి ఎందుకు ఆలోచించరని నిలదీశారు.

తమ వృత్తిని ఆధునికరించి నీరా, తాటి, ఈత ఉత్పత్తులను ప్రోత్సహించి యువతీ యువకులకు ఉపాధి కలిగించే ఆలోచన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర కార్యదర్శి సిరిపురం రమేష్ మాట్లాడుతూ.. చెట్ల పెంపకానికి సొసైటీకి ఐదు ఎకరాల చొప్పున భూమి ఇచ్చి హైబ్రిడ్ తాటి, ఈత వనాలు పెంచాలన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా నందనంలో నీరా తాటి ఈత ఉత్పత్తుల కేంద్రాన్ని ప్రారంభించాలని, ప్రతి జిల్లాలో ఈ పరిశ్రమలు ఏర్పాటు చేయాలని కోరారు.

కల్తీకల్లు పేరుతో కల్లు దుకాణాలపై ఎక్సైజ్ అధికారులు (Excise Officers) చేస్తున్న దాడులను వెంటనే ఆపాలని రైతు బీమా తరాహాలోనే గీత కార్మికులందరికీ గీతన్న భీమాను అమలు చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో జిల్లా అధ్యక్షుడు వెంకట్ గౌడ్, ఉపాధ్యక్షుడు యాదగిరి గౌడ్, రవీందర్ గౌడ్ శంకర్ గౌడ్, మోహన్ గౌడ్, కార్యదర్శులు రమేష్ గౌడ్, రాజా గౌడ్, కమిటీ సభ్యులు స్వామి గౌడ్, హన్మాగౌడ్, కృష్ణాగౌడ్, రాష్ట్ర సోషల్ మీడియా కన్వీనర్ రాజేష్ తదితరులు పాల్గొన్నారు.