HomeతెలంగాణMla Dhanpal Suryanarayana Guptha | దేశాన్ని అభివృద్ధి పథంలో నడుపుతున్న కేంద్రం

Mla Dhanpal Suryanarayana Guptha | దేశాన్ని అభివృద్ధి పథంలో నడుపుతున్న కేంద్రం

- Advertisement -

అక్షరటుడే, ఇందూరు: Mla Dhanpal Suryanarayana Guptha | ప్రధాని మోదీ (PM Modi) నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తోందని అర్బన్ ఎమ్మెల్యే ధన్​పాల్ సూర్యనారాయణ గుప్తా అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ‘వికసిత్ భారత్.. అమృతకాలం’ కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పేదల సంక్షేమం, పారదర్శక పాలన, సమగ్ర అభివృద్ధి.. బీజేపీ లక్ష్యాలని పేర్కొన్నారు. ఉజ్వల యోజన, ఆయుష్మాన్ భారత్ (Ayushman Bharat), హర్ ఘర్ జల్ (Har Ghar Jal), స్వచ్ఛభారత్, జన్ ధన్ యోజన (Jan Dhan Yojana) వంటి పథకాలు కోట్లాదిమంది ప్రజల జీవితాల్లో మార్పు తీసుకొచ్చాయని గుర్తు చేశారు. ‘ఆపరేషన్ సిందూర్’పై (Operation Sindoor) ప్రతిపక్షాలు చవకబారు వ్యాఖ్యలు చేస్తున్నాయన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల కోసం ప్రతి కార్యకర్త కష్టపడాలని పిలుపునిచ్చారు.

కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి (BJP District President Dinesh Kulachari), కార్యశాల కన్వీనర్ పోతన్​కర్​ లక్ష్మీనారాయణ, జిల్లా ఉపాధ్యక్షుడు నాగోళ్ల లక్ష్మీనారాయణ, కో–కన్వీనర్ రాంచందర్, గంగాధర్, రూరల్ కన్వీనర్ పద్మారెడ్డి, జిల్లా కార్యదర్శి సంతోష్, సుధాకర్ చారి, మాజీ కార్పొరేటర్ల, యువ మోర్చా, మహిళా మోర్చా కార్యకర్తలు పాల్గొన్నారు.