అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Bharat Forecasting System | మరింత ఖచ్చితత్వంతో వాతావరణ సమాచారం (accurate weather information) అందించడానికి కేంద్రం చర్యలు చేపట్టింది. ఇప్పటికే ఆధునిక సాంకేతికతతో ముందస్తుగానే వర్షాలు, తుపాన్ల వివరాలు అందిస్తున్న ఐఎండీ (IMD) ఇక మరించ అక్యూరెట్గా సమాచారం (accurate information) అందించగానికి వీలుగా కొత్త విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. భారత్ ఫోర్కాస్టింగ్ సిస్టమ్(BFS)ను కేంద్ర ప్రభుత్వం (central government) ప్రారంభించింది. ఖచ్చితమైన అంచనాల కోసం పూర్తి స్వదేశీ టెక్నాలజీతో దీనిని అభివృద్ధి చేశారు.
పుణేలోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెటియోరాలజీ (Indian Institute of Tropical Meteorology) వారు భారత్ ఫోర్కాస్టింగ్ సిస్టమ్‌ను డెవలప్ చేశారు. దీని ద్వారా భారతదేశ వాతావరణ అంచనా (India weather forecast) రిజల్యూషన్‌ను 12 కి.మీ నుంచి 6 కి.మీ.కు పెంచుతుంది. దీంతో దేశంలోని ప్రతి గ్రామానికి సంబంధించి ఖచ్చితమైన వాతావరణ సూచనలను (accurate weather forecasts) అందించవచ్చు. గతంలో నాలుగు గ్రామాలకు కలిపి ఒకే వాతావరణ సూచన జారీ చేసేవాళ్లమని, కొత్త విధానంతో ప్రతి గ్రామానికి వాతావరణ అప్డేట్ ఇవ్వవచ్చని భూ శాస్త్ర మంత్రిత్వ శాఖ కార్యదర్శి రవిచంద్రన్ తెలిపారు.
Bharat Forecasting System | 30 శాతం మెరుగుదల
కొత్తగా ప్రవేశపెట్టిన బీఎఫ్ఎస్ విధానంతో (BFS system) వర్షపాత అంచనాలు 30శాతం మెరుగుపడుతాయని అధికారులు తెలిపారు. ఈ విధానం ఉష్ణమండలంలో 6 కి.మీ, ధ్రువాల వద్ద 7-8 కి.మీ రిజల్యూషన్ కలిగి ఉంటుందని పేర్కొన్నారు. ప్రస్తుతం భారత్ వినియోగిస్తున్న వ్యవస్థ పరిధి 12కి.మీ. అని పేర్కొన్నారు. ప్రస్తుతం ఆరు కిలోమీటర్లకు పరిధిని పెంచడంతో మరింత పక్కాగా వాతావరణ సమాచారం (accurate weather information) అందించే వీలు కలగనుంది.