అక్షరటుడే, ఇందూరు: Payal Shankar | ప్రధాని మోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం 11 ఏళ్లలో రాష్ట్రానికి అన్ని రంగాల్లో చేయూతనందించిందని ఆదిలాబాద్(Adilabad) ఎమ్మెల్యే, బీజేపీ ఉపపక్ష నేత పాయల్ శంకర్ అన్నారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో బుధవారం ‘వికసిత్ భారత్.. అమృతకాలం’ పేరుతో ఫోటో ప్రదర్శన ప్రారంభించి విలేకరులతో మాట్లాడారు. మోడీ పాలనతో(PM Modi) దేశస్థాయిని ప్రపంచానికి చాటారన్నారు. ఆపరేషన్ సిందూర్(Operation Sindoor)తో ప్రపంచ దేశాలకు దేశ రక్షణ వ్యవస్థ ఎలా ఉందో అర్థమైందన్నారు. ప్రపంచంలో భారతదేశ ఆర్థికంగా 11వ స్థానంలో ఉంటే మోదీ పాలనలో 4వ స్థానానికి చేరుకుందన్నారు. ఇటీవల నిర్మించిన ఎత్తయిన వంతెన గురించి కశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా(Kashmir CM Omar Abdullah) ప్రధాని మోదీని ఎంతో మెచ్చుకున్నారని గుర్తు చేశారు.
Payal Shankar | పార్టీలకతీతంగా అభివృద్ధి..
దేశంలోని అన్ని రాష్ట్రాలకు పార్టీలకతీతంగా నిధులు మంజూరు చేశారన్నారు. గతంలో బీఆర్ఎస్ పాలనలోనూ రూ.9 లక్షల కోట్లు మంజూరు చేశారని, ప్రస్తుతం కాంగ్రెస్ 18 నెలల కాలంలో సుమారు రూ.2 లక్షల కోట్ల వరకు అందించారన్నారు. రాష్ట్రంలో కట్టిన ప్రతి ఇంటికి పీఎం ఆవాస్ యోజన(PM Awas Yojana)తో నిధులు వచ్చాయన్నారు.
కాళేశ్వరం(Kaleshwaram)పై కాంగ్రెస్, బీఆర్ఎస్ కావాలని నాటకాలు చేస్తున్నాయన్నారు. కాళేశ్వరంపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ(National Dam Safety Authority) పూర్తి నివేదిక ఇచ్చిందన్నారు. అయినా దోషులు ఎవరో చెప్పడం లేదన్నారు. వ్యవహారాన్ని సీబీఐకి అప్పజెప్పాలని డిమాండ్ చేశారు. సమావేశంలో బీజేపీ రాష్ట్ర నాయకుడు మురళీధర్ గౌడ్, జిల్లా నాయకులు న్యాలం రాజు, పోతన్కర్ లక్ష్మీనారాయణ, నాగోల్ల లక్ష్మీనారాయణ, నారాయణ యాదవ్, మాజీ కార్పొరేటర్లు పాల్గొన్నారు.