అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Artificial Intelligence | కృత్రిమ మేధ ప్రపంచాన్ని శాసించే స్థాయికి ఎదిగింది. కేవలం శాస్త్ర సాంకేతిక రంగాల్లోనే కాదు అన్నింట్లోనూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(Artificial Intelligence) అద్భుతాలను సృష్టిస్తోంది. అసాధ్యమన్న వాటిని సైతం సూసాధ్యం చేస్తూ ఔరా అనిపిస్తోంది. అందివచ్చిన ఏఐ టెక్నాలజీ కేసుల పరిష్కారంలో కీలక పాత్ర పోషిస్తుండడం పోలీసులకు వరంగా మారింది. ఆర్టిఫిషియిల్ ఇంటెలిజెన్స్ సహకారంతో ఆగస్టు 9వ తేదీన నమోదైన హిట్ అండ్ రన్ కేసును మహారాష్ట్ర పోలీసులు(Maharashtra Police) కేవలం 36 గంటల్లోనే ఛేదించారు. దీంతో కృత్రిమ మేధ పనితీరు మరోసారి చర్చనీయాంశమైంది.
Artificial Intelligence | ఢీకొట్టి పరారై..
ఆగస్టు 9న రాఖీపండుగ రోజున నాగ్‌పూర్ నుంచి బైక్‌పై వెళ్తున్న దంపతులను గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. వెనుక కూర్చున్న భార్య కింద పడిపోగా, ఆమె మీద నుంచి వాహనం దూసుకెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందింది. ప్రమాదానికి కారణమైన ట్రక్ డ్రైవర్(Truck Driver) ఆగకుండా పరారయ్యారు. భార్య చనిపోవడంతో ఆమె మృతదేహాన్ని బైక్‌కు కట్టుకుని భర్త ఇంటికి తీసుకెళ్లిపోయాడు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కాగా, వీడియో ఆధారంగా మహారాష్ట్ర పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. బైక్ నంబర్ ఆధారంగా బాధితుడ్ని గుర్తించి ఏం జరిగిందని ఆరా తీశారు. ప్రమాదానికి కారణమైన ట్రక్ వివరాలు లభ్యం కాకపోవడంతో కేసును ఛేదించడం పోలీసులకు సవాల్‌గా మారింది.
Artificial Intelligence | కృత్రిమ మేధతో శోధించి..
ఢీకొట్టింది ట్రక్కు అని, దానిపై రెడ్ మార్కు ఉందని మాత్రమే దర్యాప్తులో విచారణలో తేలింది. ఈ వివరాలను పట్టుకుని పోలీసులు రంగంలోకి దిగారు. కృత్రిమ మేధతో కేసును ఛేదించారు. తొలుత ఏఐ అల్గారిథమ్(AI Algorithm)ను ఉపయోగించి సీసీటీవీ ఫుటేజీలను అనలైజ్ చేశారు. రెడ్ మార్క్ ఉన్న ట్రక్కుల జాబితాను అది బయటకు తీసింది. తర్వాత ఏ ట్రక్కు స్పీడుగా వెళుతుందో గుర్తించి ఆ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఎలాంటి వివరాలు లేని హిట్ అండ్ రన్ కేసును కేవలం 36 గంటల వ్యవధిలోనే సాల్వ్ చేశారు.
Artificial Intelligence | ఏఐ సాయంతోనే..
సీసీటీవీ డేటాను సేకరించి కృత్రిమ మేధస్సు అల్గోరిథంల ద్వారా కేసును పరిష్కరించినట్లు నాగ్‌పూర్ గ్రామీణ పోలీసు సూపరింటెండెంట్ హర్ష్ పోద్దార్(Nagpur Superintendent Harsh Poddar) చెప్పారు. సీసీటీవీ డేటాను సేకరించి కృత్రిమ మేధస్సు అల్గోరిథంల ద్వారా కేసును పరిష్కరించినట్లు వివరించారు. 15-20 కి.మీ దూరంలో ఉన్న మూడు వేర్వేరు టోల్ ప్లాజాల సీసీటీవీ ఫుటేజ్ ను సేకరించి, AI అల్గోరిథంలను ఉపయోగించి విశ్లేషించామని తెలిపారు. “మొదటి అల్గోరిథం ఏమి చేసిందంటే సీసీటీవీ ఫుటేజీల్లో నమోదైన రెడ్ మార్క్‌తో ఉన్న ట్రక్కులను గుర్తించింది. రెండవది ఈ ట్రక్కులన్నింటి సగటు వేగాన్ని విశ్లేషించి, ఏ ట్రక్కులో ప్రమేయం ఉందో మాకు సమాచారం ఇచ్చింది. దాని ఆధారంగా ఒక ట్రక్కును గుర్తించాం. నాగ్‌పూర్ నుంచి 700 కి.మీ దూరంలో గ్వాలియర్-కాన్పూర్ హైవే పై సదరు ట్రక్కును స్వాధీనం చేసుకున్నాం. ప్రమాదానికి కారణమైన వారిని అరెస్టు చేశాం. AIని ఉపయోగించి 36 గంటల్లో కేసును ఛేదించాము” అని ఎస్పీ తెలిపారు.
Artificial Intelligence | మహారాష్ట్రలో తొలిసారిగా..
కేసుల సత్వర పరిష్కారానికి మహారాష్ట్ర ప్రభుత్వం(Maharashtra Government) దేశంలోనే తొలిసారిగా ప్రత్యేక విధానాన్ని తీసుకొచ్చింది. మహారాష్ట్ర పరిశోధన, విజిలెన్స్ ఫర్ ఎన్‌హాన్స్‌డ్ లా ఎన్‌ఫోర్స్‌మెంట్(మార్వెల్) అనే స్పెషల్ పర్పస్ వెహికల్‌ను ప్రవేశపెట్టింది. ఇది దేశంలోనే మొట్టమొదటి రాష్ట్ర స్థాయి పోలీసు AI వ్యవస్థ. ఇది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోఉంటుంది. దీని సాయంతో 12 గంటల సీసీటీవీ ఫుటేజ్‌ను కేవలం 15 నిమిషాలలోపే విశ్లేషించవచ్చని ఎస్పీ తెలిపారు.