HomeUncategorizedISO | సాయుధ ద‌ళాల సామ‌ర్థ్యం మ‌రింత బ‌లోపేతం.. కొత్త నిబంధ‌న‌లు రూపొందించిన కేంద్రం

ISO | సాయుధ ద‌ళాల సామ‌ర్థ్యం మ‌రింత బ‌లోపేతం.. కొత్త నిబంధ‌న‌లు రూపొందించిన కేంద్రం

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్​:ISO | పాకిస్తాన్‌(Pakistan)తో ఉద్రిక్త‌త‌ల నేప‌థ్యంలో కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ బుధవారం కొత్త మార్గ‌ద‌ర్శ‌కాలు జారీ చేసింది. సాయుధ దళాలలో స‌మ‌న్వయం, కమాండ్ సామర్థ్యాన్ని పెంపొందించేలా ఇంటర్-సర్వీసెస్ ఆర్గనైజేషన్స్ (కమాండ్, కంట్రోల్ & డిసిప్లిన్) చట్టం 2023 కింద ప‌లు మార్గదర్శకాలను రూపొందించింది. ఇంటర్-సర్వీసెస్ ఆర్గనైజేషన్స్ (కమాండ్, కంట్రోల్ మరియు డిసిప్లిన్) చట్టం 2023 కింద రూపొందించబడిన ఈ నియమాలకు సంబంధించి గెజిట్ నోటిఫికేషన్(Gazette notification) విడుద‌లైంది. తాజా నిర్ణ‌యం ఇంటర్-సర్వీసెస్ ఆర్గనైజేషన్స్ (ISO) ప్రభావవంతమైన కమాండ్, నియంత్రణ, సమర్థవంతమైన పనితీరును బలోపేతం చేస్తుంది. తద్వారా సాయుధ దళాల మధ్య స‌మ‌న్వ‌యాన్ని మ‌రింత‌ బలోపేతం చేస్తుంది.

ISO | కొత్త చ‌ట్టం ప్ర‌కారం..

2023 వర్షాకాల సమావేశాల్లో పార్లమెంటు ఉభయ సభలు ఈ బిల్లును ఆమోదించాయి. ఆగస్టు 15, 2023న రాష్ట్రపతి ఆమోదం పొందాయి, మే 08, 2024న జారీ చేయబడిన గెజిట్ నోటిఫికేషన్(Gazette notification) ప్రకారం, ఈ చట్టం మే 10, 2024 నుంచి అమల్లోకి వచ్చింది. ఈ చట్టం ISO కమాండర్‌-ఇన్-చీఫ్, ఆఫీసర్లు-ఇన్-కమాండ్‌లకు వారి కింద పనిచేస్తున్న సేవా సిబ్బందిపై కమాండ్, నియంత్రణను అమలు చేయడానికి అధికారం ఇస్తుంది. క్రమశిక్షణ, పరిపాలనను సమర్థవంతంగా నిర్వహించేందుకు దోహ‌దం చేస్తుంది. సాయుధ దళాల ప్రతి శాఖకు వర్తించే ప్రత్యేకమైన సేవా పరిస్థితులను మార్చకుండా ఇది సాధ్య‌మ‌వుతుంది.