Miss World 2025 | చార్మినార్​ వద్ద అందగత్తెల సందడి
Miss World 2025 | చార్మినార్​ వద్ద అందగత్తెల సందడి

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Miss World 2025 |మిస్​ వరల్డ్​ పోటీల్లో భాగంగా హైదరాబాద్​లో పలు ఈవెంట్లు ఘనంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా మంగళవారం వివిధ దేశాల సుందరీమణులు నగరంలోని పాతబస్తీలో హెరిటేజ్​ వాక్​ చేశారు. చార్మినార్​ వద్ద సందడి చేశారు. చార్మినార్​కు చేరుకున్న వారికి స్థానికులు ఘన స్వాగతం పలికారు.
లాడ్​బజార్​లో మిస్​ వరల్డ్​ పోటీదారులు పలు దుకాణాలను సందర్శించారు. ఆయా దుకాణాల్లో వస్తువులను కొనుగోలు చేశారు. అయితే వారి నుంచి వ్యాపారులు డబ్బులు తీసుకోలేదు. హైదరాబాద్ విశిష్టతను, చార్మినార్ లాడ్ బజార్ ప్రత్యేకతలను ప్రపంచవ్యాప్తంగా తమ దేశాల్లో చాటాలని మిస్ వరల్డ్ కంటెస్టెంట్లను కోరారు.

చార్మినార్​ వద్ద హెరిటేజ్​ వాక్​ అనంతరం వారు చౌహముల్లా ప్యాలెస్​ను సందర్శించారు. బుధవారం పోటీదారుల్లోని ఒక బృందం వరంగల్​లోని వేయి స్తంభాల గుడి, వరంగల్​ కోటను సందర్శించనుంది. మరో బృందం యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప ఆలయాన్ని సందర్శిస్తుంది.