అక్షరటుడే, బాన్సువాడ: KTR | స్థానిక సంస్థల ఎన్నికల్లో (Local Body Elections) బీఆర్ఎస్ జెండా ఎగరాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ (BRS) రాష్ట్ర అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో కామారెడ్డి జిల్లా రైతుబంధు (Raithu bandhu) సమన్వయ సమితి మాజీ అధ్యక్షుడు డాక్టర్ దుద్దాల అంజిరెడ్డి బీఆర్ఎస్లో చేరారు.
KTR | పార్టీని బలోపేతం చేయాలి
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేయాలని సూచించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యాలను ఎండగట్టాలని సూచించారు. బీఆర్ఎస్ హయాంలో రాష్ట్రంలో జరిగిన అభివృద్ధిని ప్రజలకు వివరించాలని ఆయన స్పష్టం చేశారు. బాన్సువాడ నియోజకవర్గంలో (Banswada Constituency) ఉన్న పరిస్థితులపై చర్చించారు. మాజీ మంత్రితో పాటు పార్టీ సీనియర్ నాయకులు షేక్ జుబేర్, మోచి గణేష్, చందర్ తదితరులున్నారు.