అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Hyderabad | హైదరాబాద్ నగరంలో డ్రగ్స్ దందా ఆగడం లేదు. తాజాగా ప్రముఖ నటి సోదరుడు డ్రగ్స్ కేసులో పరారు అయ్యాడు.
మాసాబ్‌ట్యాంక్ డ్రగ్స్ కేసు (Masab Tank Drugs Case)లో ప్రముఖ నటి సోదరుడు అమన్‌ప్రీత్ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.
అతడి కోసం ఈగల్ టీమ్, పోలీసులు గాలిస్తున్నారు. ట్రూప్ బజార్ (Troop Bazaar)కు చెందిన వ్యాపారులు నితిన్ సింఘానియా, శ్రనిక్ సింఘ్వి డ్రగ్స్ దందా చేస్తున్నారు. వీరిని పోలీసులు ఇటీవల అరెస్ట్ చేశారు. వారి అరెస్టుతో అమన్‌ప్రీత్ (Amanpreet) పేరు బయటకు వచ్చింది. ఈ ఇద్దరు వ్యాపారుల నుంచి అతడు డ్రగ్స్ కొన్నట్లు అధికారులు గుర్తించారు. నిందితుల నుంచి 43 గ్రాముల డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు.గతేడాది కూడా అమన్‌ప్రీత్ సైబరాబాద్ పోలీసు (Cyberabad Police)లకు పట్టుబడ్డాడు. కాగా సదరు హీరోయిన్ టాలీవుడ్, బాలీవుడ్లో పలు చిత్రాల్లో నటించింది. ఒకప్పుడు తెలుగు ఇండస్ట్రీలో బిజీగా ఉన్న ఆమె ప్రస్తుతం సినిమాలు లేక ఖాళీగా ఉంటుంది.
Hyderabad | ఆగని దందా..
హైదరాబాద్ నగరంలో డ్రగ్స్ నిర్మూలన కోసం పోలీసుల అనేక చర్యలు చేపడుతున్నారు. అయినా కూడా గంజాయి, డ్రగ్స్ ఆగడం లేదు. సెలబ్రెటిలు, ప్రముఖులు డ్రగ్స్ తీసుకుంటుండగా.. యువత, విద్యార్థులు, వలస కూలీలు గంజాయి తాగుతున్నారు. ఈగల్ టీమ్ (Eagle Team), ఎస్వోటీ పోలీసులు, హెచ్‌న్యూ అధికారులు దాడులు చేపడుతున్నా.. ఈ దందా మాత్రం ఆగడం లేదు. తాజాగా నటి సోదరుడు రెండో సారి డ్రగ్స్ కేసులో ఉండటం గమనార్హం.