అక్షరటుడే, ఇందూరు: Anil Eravatri : వీర్ సావర్కర్ పదేళ్లు జైళ్లో ఉన్నా.. దేశానికి అవసరమైన సమయంలో మాత్రం బ్రిటీష్(British) వారికి తొత్తుగా మారి దేశానికే ద్రోహం చేశారని తెలంగాణ రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ ఛైర్మన్ ఈరవత్రి అనిల్ ఆరోపించారు. 1942లో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా క్విట్ ఇండియా ఉద్యమానికి గాంధీ పిలుపు ఇస్తే దేశ ప్రజలందరూ ఆ ఉద్యమంలో పాల్గొన్నారని గుర్తుచేశారు. గాంధీజీ (Gandhiji) ఇచ్చిన క్విట్ ఇండియా పిలుపు మేరకు ఆయా రాష్ట్రాల్లోని కాంగ్రెస్ ప్రభుత్వాలు.. వాటి ప్రభుత్వాలను రద్దు చేసుకుని క్విట్ ఇండియా(Quit India) ఉద్యమంలో పాల్గొన్నాయని పేర్కొన్నారు.
నిజామాబాద్ జిల్లా కేంద్రంలో జరుగుతున్న ఆదివాసీ కాంగ్రెస్ కార్యకర్తల (tribal Congress workers) రాజకీయ శిక్షణా తరగతుల కార్యక్రమంలో గురువారం (జులై 31) పాల్గొని మాట్లాడారు.
బెంగాల్ ప్రెసిడెన్సీలో పాకిస్థాన్ కావాలని డిమాండ్ చేస్తున్న జిన్నా నేతృత్వంలోని ముస్లిం లీగ్ తో వీర్ సావర్కర్, హిందూ మహాసభ (Hindu Mahasabha) ఎమ్మెల్యేలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి బ్రిటిష్ వారికి తొత్తులుగా మారి దేశానికి ద్రోహం చేశారన్నారు.
ఆ ప్రభుత్వంలో శ్యాంప్రసాద్ ముఖర్జీ (Shyam Prasad Mukherjee) కూడా ఉన్న మాట వాస్తవం కదా అని ప్రశ్నించారు. అటువంటి వీర్ సావర్కర్ దేశ ద్రోహి కాకుండా దేశ భక్తుడు అవుతుడా అని నిలదీశారు. అటువంటి చరిత్ర ఉన్న పార్టీ నేతలు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకుల గురించి మాట్లాడటం విడ్డూరమని పేర్కొన్నారు.
Anil Eravatri : దేశం కోసం కాంగ్రెస్ నేతలు ఎంతో చేశారు..

దేశం కోసం కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎంతో చేశారని అనిల్ పేర్కొన్నారు. గాంధీ, నెహ్రూ, సుభాష్ చంద్రబోస్, లాలాలజపతి రాయ్ వంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు దేశ స్వాతంత్య్రం కోసం కృషి చేశారన్నారు.
స్వతంత్రం వచ్చిన తర్వాత దేశాభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీ అహర్నిశలు కష్టపడిందని ఈరవత్రి అనిల్ చెప్పుకొచ్చారు. దేశంలో ఆదివాసీలకు, బంజారాలకు హక్కులు కల్పించింది కాంగ్రెస్ పార్టీ అని తెలిపారు. దళితులు, గిరిజనులు, ఆదివాసీలకు కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగ రక్షణ కల్పించిందన్నారు. పోడు భూములకు హక్కులు కల్పించింది కాంగ్రెస్ పార్టీ కాదా అని ప్రశ్నించారు.