అక్షరటుడే, వెబ్‌డెస్క్: Boxing Day Test | యాషెస్ సిరీస్ (Ashes Series)లో భాగంగా జరిగిన బాక్సింగ్ డే టెస్ట్ మ్యాచ్ రెండు రోజుల్లోనే ముగిసింది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ జట్టు ఘన విజయం సాధించింది.ఆస్ట్రేలియాలో యాషెస్ సిరీస్ జరుగుతోంది. తొలి మూడు టెస్ట్‌ల్లో ఆస్ట్రేలియా (Australia) ఘన విజయం సాధించి సిరీస్ కైవసం చేసుకుంది.
మరో రెండు మ్యాచ్‌లు గెలిచి క్లీన్ స్వీప్ చేయాలని చూసింది. అయితే డిసెంబర్ 26న ప్రారంభమైన బాక్సింగ్ డే టెస్ట్‌లో ఇంగ్లాండ్ గెలుపొందింది. ఈ మ్యాచ్ రెండు రోజుల్లోనే పూర్తి కావడం గమనార్హం. బౌలర్లు నిప్పులు చెరగడంతో ఇరు జట్లు తక్కువ స్కోర్లకే పరిమితం అయ్యాయి.
Boxing Day Test | నాలుగు వికెట్ల తేడాతో..
బాక్సిండ్ డే టెస్ట్‌లో తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 152 పరుగులకు ఆలౌట్ అయింది. నిసర్ 35 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఇంగ్లాండ్ బౌలర్ జోష్ టంగ్ 5 వికెట్లు తీశాడు. అనంతరం బ్యాటింగ్ చేసిన ఇంగ్లిష్ జట్టు సైతం తక్కువ స్కోర్‌కే పరిమితమైంది. ఆసీస్ బౌలర్ల ధాటికి 110 పరుగులకే కుప్ప కూలింది. హ్యారీ బ్రూక్ (Harry Brook) 41 పరుగులు చేశారు. ఆస్ట్రేలియా బౌలర్లు నిసర్ 4, బోలాండ్ 3 వికెట్లు తీశారు. అనంతరం రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన తొలి రోజు నాలుగు పరుగులు మాత్రమే చేసింది. రెండో ఆట ప్రారంభం అయ్యాక హెడ్ 42 పరుగులు మినహా మిగతా బ్యాటర్లు విఫలం అయ్యారు. దీంతో ఆసీస్ జట్టు 132 పరుగులకు అలౌట్ అయింది. 175 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ నాలుగు వికెట్ల తేడాతో గెలుపొందింది. క్రాలే 37, బెన్ డకెట్ 34, జాకోబ్ 40 పరుగులతో రాణించారు.
Boxing Day Test | 15 ఏళ్ల తర్వాత..
యాసెస్ సిరీస్ కోల్పోయిన ఇంగ్లాండ్ (England)కు ఈ విజయం కాస్త ఊరటనిచ్చింది. ఐదు మ్యాచ్‌లు గెలిచి క్లీన్ స్వీప్ చేద్దామకున్న ఆసీస్‌పై ఇంగ్లాండ్ బ్యాటర్లు నీళ్లు చల్లారు. పిచ్ బౌలింగ్‌కు అనుకూలిస్తున్నా.. నెమ్మదిగా ఆడి జట్టుకు విజయం అందించారు. కాగా ఆస్ట్రేలియాలో ఇంగ్లాండ్ 15 ఏళ్ల తర్వాత టెస్ట్ మ్యాచ్ గెలవడం గమనార్హం. చివరగా.. 2011 జనవరిలో ఆ జట్టు విజయం సాధించింది. ఇంగ్లాండ్ ఆటగాడు జోష్ టంగ్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు.