అక్షరటుడే, ఇందూరు/కోటగిరి: Brahma kamalam | హిమాలయాల్లో (In the Himalayas) మాత్రమే వికసించే బ్రహ్మకమలానికి ఎంతో విశిష్టత ఉంది. ఈ పుష్పం అరుదుగా మాత్రమే పూస్తుంది. అలాంటి బ్రహ్మ కమలం ప్రస్తుతం నిజామాబాద్ జిల్లాలోనూ విరబూసింది.
విద్యుత్‌శాఖలో (Electricity Department) పనిచేస్తున్న ఏడీఈ తోట రాజశేఖర్ (ADE Thota Rajasekhar) దంపతులు నిజామాబాద్ నగరంలో నివాసం ఉంటున్నారు. వీరు కర్ణాటక (Karnataka) రాష్ట్రంలోని మురుడేశ్వర్ (Murudeshwar) నుంచి గతంలో మొక్కను తీసుకువచ్చి తమ ఇంటి ఆవరణలో నాటారు.
ప్రస్తుతం ఆ మొక్కకు మూడు పువ్వులు పూశాయి. అలాగే పోతంగల్(pothangal)మండల కేంద్రంలో జింగరి గంగాధర్, జయశ్రీ దంపతులు బ్రహ్మకమలం మొక్కను బద్రీనాథ్ (Badrinath) నుంచి తెచ్చారు. ఆ మొక్క సైతం పుష్పించింది. ఈ సందర్భంగా ఆ పువ్వులకు ప్రత్యేక పూజలు చేశారు.
Brahma kamalam | వర్ని మండలంలోని గోవూరులో..

వర్ని మండలంలోని గోవూర్ గ్రామంలోనూ బ్రహ్మకమలం వికసించింది. దీంతో ఈ పువ్వుకు భక్తులు భక్తితో పూజలు చేశారు.