ePaper
More
    Homeఅంతర్జాతీయంRussia - Ukraine War | ర‌క్త‌పాతానికి ముగింపు ప‌ల‌కాల్సిందే.. ర‌ష్యా, ఉక్రెయిన్ యుద్ధంపై ట్రంప్...

    Russia – Ukraine War | ర‌క్త‌పాతానికి ముగింపు ప‌ల‌కాల్సిందే.. ర‌ష్యా, ఉక్రెయిన్ యుద్ధంపై ట్రంప్ వ్యాఖ్య‌

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Russia – Ukraine War | ర‌ష్యా, ఉక్రెయిన్ మ‌ధ్య జ‌రుగుతున్న యుద్ధాన్ని నిలువ‌రించేందుకు అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ (US president donald trump) ప్ర‌యత్నిస్తున్నారు. ఈ మేర‌కు రెండు దేశాల నాయకుల‌తో తాను వేర్వేరుగా ఫోన్‌లో మాట్లాడాన‌ని వెల్ల‌డించారు. ఈ ర‌క్త‌పాతాన్ని ఆపాల్సిందేన‌ని తాను రెండు దేశాల‌కు సూచించాన‌న్నారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో (russia-ukrain war) ప్రతి వారం సగటున 5,000 మంది యువ సైనికులు ప్రాణాలు కోల్పోతున్నారని, ఈ సంఖ్య అంతకంటే ఎక్కువగా ఉండవచ్చని ట్రంప్ ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే, సామాన్య ప్రజలు కూడా మరణిస్తున్నారని తెలిపారు. ఈ యుద్ధాన్ని “రక్తపాతం”గా అభివర్ణించిన ట్రంప్.. తాను చూసిన ఉపగ్రహ చిత్రాలు భయానకంగా, దారుణంగా ఉన్నాయని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. రష్యా, ఉక్రెయిన్ నాయకులతో (russia – ukrain leaders) జరిపిన చ‌ర్చ‌లు పురోగతి సాధిస్తున్నామని, యుద్ధాన్ని ఆపడానికి ప్రయత్నాలు కొనసాగుతున్నాయ‌ని తెలిపారు.

    Russia – Ukraine War | త్వ‌ర‌లోనే కాల్పుల విర‌మ‌ణ చ‌ర్చ‌లు..

    యుద్ధాన్ని నివారించేందుకు అమెరికా (america) కృషి చేస్తుంద‌ని ట్రంప్ తెలిపారు. ఈ క్రమంలోనే ర‌ష్యా అధ్య‌క్షుడు వ్లాదిమిర్ పుతిన్‎తో (russian president vladimir putin) ఫోన్లో చర్చించినట్లు వెల్లడించారు. కొంత పురోగతి సాధించామని భావిస్తున్నట్లు చెప్పారు. మేము మా వంతు ప్రయత్నం చేస్తున్నామని, ఇది మా యుద్ధం, నాకోసం కాదన్నారు. గత పరిపాలన (బైడెన్‌) సమయంలో వచ్చిన సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నిస్తున్నామన్నారు. రష్యా, ఉక్రెయిన్ నాయకులు (russia – ukrain leaders) వెంటనే కాల్పుల విరమణ చర్చలు ప్రారంభిస్తారని ట్రంప్ ప్రకటించారు. అయితే, ఈ చర్చలు ఎప్పుడు, ఎక్కడ జరుగుతాయి, ఎవరు పాల్గొంటారనే వివరాలు స్పష్టంగా తెలుపలేదు. ఈ ప్రకటనకు ముందు, 2022 తర్వాత రష్యా, ఉక్రెయిన్ ప్రతినిధుల మధ్య తొలిసారిగా నేరుగా చర్చలు జరిగాయి. టర్కీలో (turkey) శుక్రవారం జరిగిన ఈ చర్చల్లో ఖైదీల మార్పిడి జరిగినప్పటికీ, యుద్ధం ఆగలేదు.

    Russia – Ukraine War | యుద్ధంపై ట్రంప్ నిరాశ‌

    ర‌ష్యా, ఉక్రెయిన్ మ‌ధ్య జ‌రుగుతున్న యుద్ధం, రెండు దేశాల నాయ‌క‌త్వ వైఖ‌రి ప‌ట్ల ట్రంప్ (trump) నిరాశ‌తో ఉన్నార‌ని వైట్‌హౌస్ తెలిపింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ (russian president vladimir putin) యుద్ధాన్ని ఆపడానికి నిజంగా ఆసక్తి కలిగి ఉన్నారో లేదో చూడాల్సి ఉంద‌న్నారు. ఒక‌వేళ ఆస‌క్తి లేకపోతే, యుద్ధాన్ని ఆపేందుకు అమెరికా మ‌ధ్య‌వ‌ర్తిత్వం నుంచి త‌ప్పుకుంటుంద‌ని ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ అన్నారు. పుతిన్ శాంతిని కోరుకుంటున్నార‌ని తాను నమ్ముతున్నానని ట్రంప్ తరువాత విలేకరులతో అన్నారు. ఈ శాంతి చర్చల షరతులను రెండు పక్షాలు చర్చించుకుంటాయి. ఎందుకంటే, వారికి మాత్రమే ఈ చర్చల వివరాలు తెలుసు, ఇతరులకు అవి తెలియవని ట్రంప్ సోషల్ మీడియా పోస్ట్‌లో (trump social media post) పేర్కొన్నారు. ఈ యుద్ధం రెండు దేశాలకు మాత్రమే కాకుండా, ప్రపంచ శాంతిని సూచిస్తుందన్నారు.

    Latest articles

    World Cup Qualifiers | అండర్-19 వరల్డ్ కప్ అమెరికాస్ క్వాలిఫయర్స్‌లో సంచలనం.. ఐదు బంతుల్లో ముగిసిన మ్యాచ్

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: World Cup Qualifiers | ప్రపంచ క్రికెట్‌లో మరో చారిత్రాత్మక ఘట్టం ఆవిర్భవించింది. అండర్-19 వరల్డ్ కప్...

    NZB CP | ఉర్సు ఉత్సవాలు.. భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన సీపీ

    అక్షరటుడే, బోధన్: NZB CP | నిజామాబాద్​ జిల్లా (Nizamabad district) బోధన్ పట్టణంలో జలాల్బుకారి దర్గా ఉర్సు...

    BJP | ‘ప్రతి బూత్ – బీజేపీ బూత్’గా చేయడమే లక్ష్యంగా పని చేస్తాం : బీజేపీ జిల్లా అధ్యక్షుడు

    అక్షరటుడే, ఇందల్వాయి: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావును (BJP State President Ramchandra Rao) సోమవారం (ఆగస్టు...

    Supreme Court | పెరిగిపోయిన వీధి కుక్కలు.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ..

    అక్షరటుడే, న్యూఢిల్లీ: ఢిల్లీ - ఎన్సీఆర్​ ప్రాంతాల్లోని (Delhi-NCR areas) దారులపై వీధి కుక్కలు విపరీతంగా పెరిగిపోయాయి. ఈ...

    More like this

    World Cup Qualifiers | అండర్-19 వరల్డ్ కప్ అమెరికాస్ క్వాలిఫయర్స్‌లో సంచలనం.. ఐదు బంతుల్లో ముగిసిన మ్యాచ్

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: World Cup Qualifiers | ప్రపంచ క్రికెట్‌లో మరో చారిత్రాత్మక ఘట్టం ఆవిర్భవించింది. అండర్-19 వరల్డ్ కప్...

    NZB CP | ఉర్సు ఉత్సవాలు.. భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన సీపీ

    అక్షరటుడే, బోధన్: NZB CP | నిజామాబాద్​ జిల్లా (Nizamabad district) బోధన్ పట్టణంలో జలాల్బుకారి దర్గా ఉర్సు...

    BJP | ‘ప్రతి బూత్ – బీజేపీ బూత్’గా చేయడమే లక్ష్యంగా పని చేస్తాం : బీజేపీ జిల్లా అధ్యక్షుడు

    అక్షరటుడే, ఇందల్వాయి: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావును (BJP State President Ramchandra Rao) సోమవారం (ఆగస్టు...