అక్షరటుడే, బాన్సువాడ: CITU Banswada | బీజేపీ ప్రభుత్వం కార్మిక చట్టాలను కాలరాస్తోందని సీఐటీయూ జిల్లా నాయకుడు ఖలీల్ అన్నారు. మంగళవారం బాన్సువాడ మున్సిపల్ కమిషనర్ (Banswada Municipal Commissioner) శ్రీహరి రాజుకు సంఘం ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికులు సమ్మె నోటీసులు ఇచ్చారు. ఈనెల 20న దేశవ్యాప్తంగా ఒకరోజు సమ్మె(One-day strike) నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్మికులకు కనీస వేతనం రూ.26వేలు, ఈఎస్ఐ, పీఎఫ్ సౌకర్యం కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో బుజ్జిగారి సాయిలు, వెంకట్, శివ రాజులు తదితరులు పాల్గొన్నారు.
CITU Banswada | కార్మిక చట్టాలను కాలరాస్తున్న బీజేపీ ప్రభుత్వం
- Advertisement -
