HomeUncategorizedIncomeTax Commissioner | ఐటీ డిపార్ట్‌మెంట్​లో అతిపెద్ద అవినీతి తిమింగళం.. జీవన్​లాల్​

IncomeTax Commissioner | ఐటీ డిపార్ట్‌మెంట్​లో అతిపెద్ద అవినీతి తిమింగళం.. జీవన్​లాల్​

- Advertisement -

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Income Tax Commissioner : ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ కమిషనర్‌ జీవన్‌లాల్ కమిషనర్ అవతారం ఎత్తాడు. అక్రమ ఆస్తులు కూడగట్టుకుని అవినీతి కొండనే పేర్చాడు. వైరా మాజీ ఎమ్మెల్యే రాములు నాయక్‌ కొడుకు ఈ జీవన్‌లాల్. ఇటీవల ముంబయిలో రూ.70 లక్షలు లంచం తీసుకుంటూ సీబీఐకి రెడ్​ హ్యాండెడ్​గా పట్టుబడ్డాడు.

ఇన్నాళ్లు ఇతగాడు పోగేసిన అవినీతి సంపద చూసి సీబీఐ అధికారులు షాక్ అయ్యారు. ముంబయికి చెందిన ఎన్​డీడబ్ల్యూ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ NDW Development Corporation నుంచి రూ.2.5 కోట్ల విలువైన ప్లాట్‌ను లంచంగా తీసుకున్నాడు ఈ అవినీతి తిమింగళం జీవన్​లాల్​.

ఖమ్మం జిల్లా Khammam district కు చెందిన బినామీ దండెల్‌ వెంకటేశ్వర్​ పేరిట ప్లాట్లను రిజిస్ట్రేషన్‌ చేయించినట్లు సీబీఐ అధికారులు గుర్తించారు. ముంబయి Mumbai లోని మరో రెండు సంస్థల నుంచి కూడా రూ.35 లక్షలు లంచం తీసుకున్నట్లు విచారణలో తేలింది. ఈ సొమ్మును హవాలా hawala మార్గంలో స్వీకరించినట్లు ఆధారాలు లభించాయి.

షాపూర్‌జీ పల్లోంజీ నిర్మాణ సంస్థ Shapoorji Pallonji Construction Company ట్యాక్సేషన్‌ ఫైల్ పెండింగ్‌ను క్లియర్‌ చేసేందుకు రూ. 1.20 కోట్ల లంచం డిమాండ్‌ చేసినట్లు సీబీఐ దృష్టికి వచ్చింది. ఇద్దరు మధ్యవర్తుల ద్వారా రూ.15 లక్షలు లంచం తీసుకున్న ఈ అవినీతిపరుడు.. మరో రూ. 70 లక్షలు తీసుకుంటుండగా సీబీఐ అధికారులకు దొరికిపోయాడు. ఈ వ్యవహారంలో మొత్తం 15 మందిపై సీబీఐ కేసులు నమోదు చేసింది. లంచం ఇచ్చిన వారిని కూడా నిందితులుగా చేర్చింది.