అక్షరటుడే, వెబ్‌డెస్క్: Best public transport cities : ప్రపంచంలో అత్యుత్తమ ప్రజా రవాణా నెట్వర్క్ (best public transport network) ఉన్న నగరాల జాబితాలో ముంబయి (Mumbai), ఢిల్లీ(Delhi)కి చోటు లభించింది. ప్రపంచ వ్యాప్తంగా నిర్వహించిన సర్వేలో అత్యుత్తమ పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ నెట్వర్క్ కలిగిన 19 నగరాలను ఎంపిక చేయగా, ఇండియా నుంచి ఈ రెండు మెట్రో నగరాలు చోటు దక్కించుకున్నాయి.
అత్యుత్తమ ప్రజా రవాణాలో హాంగ్కాంగ్ (Hong Kong) మొదటి స్థానంలో నిలిచింది. చైనా(China)కి చెందిన షాంఘై (Shanghai), బీజింగ్ (Beijing) నగరాలు రెండు, మూడు స్థానాల్లో నిలువగా, యూఏఈ రాజధాని అబుదాబి(UAE capital Abu Dhabi)కి నాలుగో స్థానం దక్కింది. ఇక మన దేశ ఆర్థిక రాజధాని ముంబయి తొమ్మిది, దేశ రాజధాని ఢిల్లీ 11వ స్థానాల్లో నిలవడం విశేషం.
Best public transport in the world : ప్రపంచ వ్యాప్తంగా సర్వే..
జన జీవనానికి నిత్యావసరాలే కాకుండా ప్రజా రవాణా వ్యవస్థ కూడా ఎంతో కీలకం. ఇది సరిగా లేకుంటే ఆ ప్రాంతం కానీ, ఆ దేశ మనుగడ కానీ ముందుకు సాగలేదు. అనేక కారణాల వల్ల పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ జీవనాధారంగా ఉంటుంది. మిగతా వాటితో పోలిస్తే ప్రజా రవాణా వ్యవస్థ చౌకగా, అలాగే సౌకర్యవంతం కానుంది.
ఎంతో ముఖ్యమైన రవాణా వ్యవస్థపై టైమ్ అవుట్ సంస్థ సర్వే నిర్వహించింది. ఏ నగరంలో అన్నింటికంటే అత్యుత్తమ ప్రజా రవాణా నెట్వర్క్ ఉందో తెలుసుకోవడానికి 50 కంటే ఎక్కువ దేశాలలో 18,500 కంటే ఎక్కువ మందితో సర్వే జరిపింది. ప్రజా రవాణా నెట్వర్క్ – బస్సులు, రైళ్లు, సహా అన్నింటిని ఈ సర్వేలో చేర్చింది.
అయితే, ఈసారి ఆసియా నగరాలు జాబితాలో ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. న్యూయార్క్(New York) లోని విశాలమైన సబ్ వే (subway), ఇస్తాంబుల్(Istanbul) లోని క్రాస్-కాంటినెంటల్ ఫెర్రీలు (cross-continental ferries) వంటి కొన్ని ఐకానిక్ పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ నెట్వర్క్ లకు జాబితాలో చోటు దక్కలేదు. కానీ ఎడిన్బర్గ్ నుంచి అబుదాబి వరకు, బ్రిటన్ నుంచి బీజింగ్ వరకు చాలా నగరాలు జాబితాలో ఉన్నాయి.
Best public transport in the world : ముంబయి, ఢిల్లీలో రైల్వే, మెట్రో సేవలు..
ముంబయి జీవనాధారం మొత్తం లోకల్ రైళ్లపై ఆధారపడి ఉంది. ఉదయం నుంచి రాత్రివరకు ప్రయాణికుల రద్దీ కొనసాగుతుంటుంది. దేశ ఆర్థిక రాజధానిలో సంచరించడానికి ఇవి అత్యంత సమర్థవంతమైన ఎంపిక. అతిపెద్ద నగరమైన ముంబయిలో లోకల్ రైళ్ల నెట్వర్క్ మీద 83 శాతం స్థానికులు అత్యంత సంతృప్తితో ఉన్నారు. 1,400 చదరపు కిలోమీటర్ల కంటే ఎక్కువ విస్తీర్ణంలో, 33 మిలియన్లకు పైగా ప్రజలు ఉన్న ఢిల్లీలో కూడా మెరుగైన ప్రజా రవాణా వ్యవస్థ అందుబాటులో ఉంది. ఢిల్లీ మెట్రో(Delhi Metro)తో పాటు సబర్బన్ రైల్వే సేవలు స్థానికుల అవసరాలను తీర్చడంలో మొదటి స్థానంలో ఉన్నాయి. ఇక, బస్సులు, ఈ రిక్షాలు కూడా స్థానికుల అవసరాలను తీర్చడంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి.
Best public transport in the world : ప్రపంచంలోనే అత్యుత్తమ ప్రజా రవాణా
- 1. హాంకాంగ్, జపాన్
- 2. షాంఘై, చైనా
- 3. బీజింగ్, చైనా
- 4. అబుదాబి, యూఏఈ
- 5 తైపీ, తైవాన్
- 6 లండన్, యూకే
- 7 వియన్నా, ఆస్ట్రియా
- 8 సియోల్, దక్షిణ కొరియా
- 9 ముంబై, ఇండియా
- 10 దోహా, ఖతార్
- 11 ఢిల్లీ, ఇండియా
- 12 సింగపూర్, సింగపూర్
- 13 జ్యూరిచ్, స్విట్జర్లాండ్
- 14 బ్రిటన్, యూకే
- 15 ఎడిన్బర్గ్, యూకే
- 16 ఓస్లో, నార్వే
- 17 జకార్తా, ఇండోనేషియా
- 18 వార్సా, పోలాండ్
- 19 టాలిన్, ఎస్టోనియా