అక్షరటుడే, ఇందూరు : MLA Dhanpal | నగరంలోని రామర్తి చెరువు (Ramarthi Lake)సుందరీకరణ పనులను వేగంగా చేపట్టాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా అన్నారు. నగరంలోని క్యాంప్ కార్యాలయంలో పబ్లిక్ హెల్త్ మున్సిపల్ ఇంజినీరింగ్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అమృత్ పథకం (Amrit Scheme) కింద అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ వ్యవస్థ, మ్యాన్ హోల్స్ పనులను నిర్ణీత గడువులోగా వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు.
MLA Dhanpal | వాటర్ వర్క్స్, ట్యాంకు పనులు..
వాటర్ వర్క్స్, వాటర్ ట్యాంకుల పనులు, నీటి సరఫరా వ్యవస్థకు సంబంధించిన అన్ని నిర్మాణాలను నాణ్యత ప్రమాణాలతో పూర్తి చేయాలని ఎమ్మెల్యే ధన్పాల్ సూచించారు. ప్రతి డివిజన్‌కు కోటి చొప్పున అభివృద్ధి, మరమ్మతు పనుల కోసం టెండర్ ప్రక్రియను పూర్తి చేసి, నిర్మాణ పనులను చేపట్టాలన్నారు. ప్రజా అవసరాలను ప్రథమ ప్రాధాన్యతగా తీసుకొని, బాధ్యతాయుతంగా చిత్తశుద్ధితో పనులు పూర్తి చేయాలన్నారు. నగర అభివృద్ధి లక్ష్యంగా.. ప్రజల సంక్షేమమే ఆశయంగా ముందుకు సాగుతున్నామని పేర్కొన్నారు. పబ్లిక్ హెల్త్ ఈఈ తిరుపతి, ఏఈ శంకర్, ఇన్‌ఛార్జి మున్సిపల్ ఈఈ నగేష్ రెడ్డి పాల్గొన్నారు.