అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Ind vs Nz T20 | న్యూజిలాండ్‌తో జరుగుతున్న ఐదో టీ 20లో భారత్ బ్యాటర్లు రెచ్చిపోయారు. ఆకాశమే హద్దుగా చెలరేగడంతో టీమిండియా (Team India) భారీ స్కోర్ చేసింది.
ఐదు టీ 20 సిరీస్‌ల్లో (T20 series) భాగంగా ఆఖరి మ్యాచ్ తిరువనంతపురంలో జరుగుతోంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ ఆది నుంచి కివీస్ బౌలర్లను ఊచకోత కోసింది. ఓపెనర్ అభిషేక్ శర్మ మంచి ఆరంభాన్ని ఇచ్చారు. 16 బంతుల్లో 30 పరుగులు చేశాడు. మరో ఓపెనర్ సంజు శాంసన్ మళ్లీ నిరాశ పరిచిన మిగతా బ్యాటర్లు రాణించడంతో భారత్ 271 పరుగులు చేసింది. టీ 20లో వన్డే తరహా స్కోర్‌తో నమోదు చేసి రికార్డు సృష్టించింది.
Ind vs Nz T20 | ఇషాన్ సెంచరీ
ఇషాన్ కిషాన్ మరోసారి చెలరేగి ఆడాడు. 43 బంతుల్లో 103 పరులుగు చేశాడు. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ సైతం 30 బంతుల్లో 63 పరుగులతో రాణించాడు. హర్దిక్ పాండ్యా 17 బంతుల్లో 47 పరుగులు చేసి ఆఖర్లో మెరుపులు మెరిపించాడు. దీంతో భారత్ నిర్ణిత 20 ఓవర్లలో ఏకంగా 270 పరుగులు చేసింది. ఈ ఇన్నింగ్స్‌లో భారత బ్యాటర్లు 23 సిక్స్‌లు కొట్టడం గమనార్హం. భారత బ్యాటర్ల ధాటికి కివీస్ బౌలర్లు చిత్తు అయ్యారు. మిచెల్ సాంటర్ 4 ఓవర్లు వేసి 60 పరుగులు ఇచ్చాడు. బౌండరీలతో విరుచుకుపోవడంతో కివీస్ ఫీల్డర్లు ప్రేక్షక పాత్రకు పరిమితం అయ్యారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన కివీస్ 17 పరుగులకే తొలి వికెట్ కోల్పోయింది.