ePaper
More
    Homeజిల్లాలుకామారెడ్డిSardar Papanna Goud | ఘనంగా సర్దార్​ సర్వాయి పాపన్న గౌడ్​ జయంతి

    Sardar Papanna Goud | ఘనంగా సర్దార్​ సర్వాయి పాపన్న గౌడ్​ జయంతి

    Published on

    అక్షరటుడే, ఇందూరు: Sardar Papanna Goud | సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ (Sardar Sarvai Papanna Goud) బహుజన ధీరత్వానికి ప్రతీక అని బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు నరాల సుధాకర్ (Narala Sudhakar) అన్నారు.

    పాపన్న గౌడ్ జయంతి సందర్భంగా వినాయక్​నగర్​లోని (Vinayak nagar) హనుమాన్ జంక్షన్​లో (Hanuman Junction) విగ్రహానికి సోమవారం పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పాపన్న గౌడ్ పోరాట స్ఫూర్తితో బహుజనులందరూ ముందుకు సాగి హక్కులను సాధించుకోవాలని స్పష్టం చేశారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు కావాలంటే బీసీ కులాలన్నీ ఏకమై పోరాడాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో నాయకులు దేవేందర్, శంకర్, చంద్రమోహన్, శంకర్, గంగా కిషన్, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.

    మండల కేంద్రంలో గౌడ సంఘం ఆధ్వర్యంలో..

    లింగంపేటలో..

    అక్షరటుడే, లింగంపేట: మండల కేంద్రంలో గౌడ సంఘం ఆధ్వర్యంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతిని సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎల్లమ్మ ఆలయం ఎదుట ఉన్న సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం గౌడ సంఘం నాయకులు మాట్లాడుతూ.. ప్రతిఒక్క గౌడ కులస్థులు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్​ను ఆదర్శంగా తీసుకోవాలని, ఆయన చూపిన మార్గంలో నడవాలని సూచించారు. కార్యక్రమంలో నారా గౌడ్, భాస్కర్ గౌడ్, ప్రసాద్ గౌడ్, రామ్ చందర్ గౌడ్ రాజేశ్వర్ గౌడ్, సిద్ధ గౌడ్, లక్ష్మీనారాయణ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

    సర్దార్​ పాపన్న గౌడ్​ చిత్రపటానికి నివాళులు అర్పిస్తున్న ముత్యాల సునీల్​కుమార్​

    భీమ్​గల్​లో..

    అక్షరటుడే, భీమ్​గల్: సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ మనందరికీ ఆదర్శనీయుడని కాంగ్రెస్ బాల్కొండ నియోజకవర్గ ఇన్​ఛార్జి ముత్యాల సునీల్ కుమార్ అన్నారు. బాల్కొండలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతిని సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆయన చేసిన పోరాటాలను కొనియాడారు. సామాజిక సమానత్వం బహుజనులకు రాజ్యాధికారం కోసం అలుపెరగని పోరాటం చేసిన వీరుడు సర్దార్ సర్వాయి పాప్పన్న గౌడ్ అని కొనియాడారు. కార్యక్రమంలో పార్టీ మండలాధ్యక్షుడు వెంకటేష్ గౌడ్, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

    పిట్లం మండల కేంద్రంలో..

    నిజాంసాగర్​లో..

    అక్షరటుడే, నిజాంసాగర్: పిట్లం మండల కేంద్రంలో గీతా పారిశ్రామిక సహకార సంఘంలో సర్దార్ సర్వాయి పాపన్న జయంతిని సోమవారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు హన్మాండ్లు, సీనియర్ నాయకులు అడ్వకేట్ రామ్​రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, బీఆర్​ఎస్​ నాయకులు జొన్న శ్రీనివాస్ రెడ్డి, పద్మశాలి సంఘం అధ్యక్షుడు మధు, గీతా పారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షుడు గౌడ పెద్దలు నర్సా గౌడ్, సాయ గౌడ్ పాల్గొన్నారు.

    బాల్కొండ గౌడ సంఘం ఆధ్వర్యంలో..

    కిసాన్​నగర్​లో గౌడ సంఘం ఆధ్వర్యంలో..

    Latest articles

    Cp Sai chaitanya | గణేష్ విగ్రహాల ఏర్పాటు సమాచారాన్ని ఆన్​లైన్​లో పొందుపర్చాలి: సీపీ

    అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Cp Sai chaitanya | గణేష్ విగ్రహాల ఏర్పాటు సమాచారాన్ని నిర్వాహకులు తప్పనిసరిగా ఆన్​లైన్​లో...

    Nizamabad Collector | ప్రజావాణికి 52 ఫిర్యాదులు

    అక్షర టుడే, ఇందూరు: Nizamabad Collector | జిల్లాకేంద్రంలోని కలెక్టరేట్‌లో సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా...

    Nizamsagar | నిజాంసాగర్​ ప్రాజెక్ట్​పైకి పర్యాటకులకు నోఎంట్రీ

    అక్షరటుడే, నిజాంసాగర్: Nizamsagar | నిజాంసాగర్ ప్రాజెక్టులోకి ఎగువ భాగం నుంచి లక్ష క్యూసెక్కులకు పైగా ఇన్​ఫ్లో వస్తోంది....

    Muthoot Fincorp | ముత్తుట్ ఫిన్‌కార్ప్ Q1 ఫలితాలు: లాభాలు తగ్గుముఖం, ఆదాయం, వ్యాపారం వృద్ధి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Muthoot Fincorp | ముత్తుట్ ఫిన్‌కార్ప్ 2025-26 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో (Q1FY26)...

    More like this

    Cp Sai chaitanya | గణేష్ విగ్రహాల ఏర్పాటు సమాచారాన్ని ఆన్​లైన్​లో పొందుపర్చాలి: సీపీ

    అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Cp Sai chaitanya | గణేష్ విగ్రహాల ఏర్పాటు సమాచారాన్ని నిర్వాహకులు తప్పనిసరిగా ఆన్​లైన్​లో...

    Nizamabad Collector | ప్రజావాణికి 52 ఫిర్యాదులు

    అక్షర టుడే, ఇందూరు: Nizamabad Collector | జిల్లాకేంద్రంలోని కలెక్టరేట్‌లో సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా...

    Nizamsagar | నిజాంసాగర్​ ప్రాజెక్ట్​పైకి పర్యాటకులకు నోఎంట్రీ

    అక్షరటుడే, నిజాంసాగర్: Nizamsagar | నిజాంసాగర్ ప్రాజెక్టులోకి ఎగువ భాగం నుంచి లక్ష క్యూసెక్కులకు పైగా ఇన్​ఫ్లో వస్తోంది....