అక్షరటుడే, హైదరాబాద్ :Hyderabad Traffic | హైదరాబాద్ నగరంలో లక్షల సంఖ్యలో వాహనాలు ఉంటాయి. నిత్యం ఆయా వాహనాల రద్దీతో రోడ్లపై ట్రాఫిక్ జామ్(Traffic Jam) అవుతుంది. నగరవాసులు రోజులో కొన్ని గంటలు ట్రాఫిక్‌లోనే గడుపుతారంటే అతిశయోక్తి కాదు. అయితే నగరంలో ట్రాఫిక్ నియంత్రణకు పోలీసులు చేపడుతున్న చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నాయి. మహానగరంలో వాహనాల సగటు వేగం గతంతో పోల్చితే గణనీయంగా పెరిగిందని హైదరాబాద్ సీపీ CV ఆనంద్(Hyderabad CP CV Anand) తెలిపారు.
Hyderabad Traffic | వాహనాలు పెరిగినా..
హైదరాబాద్ నగరంలో ఇటీవల వాహనాల సంఖ్య పెరిగిందని సీపీ ఆనంద్ తెలిపారు. హైదరాబాద్-రాచకొండ-సైబరాబాద్ ప్రాంతంలో వాహనాల సంఖ్య 91 లక్షలకు చేరిందన్నారు. అంతేకాకుండా నిత్యం వేలాది వాహనాలు ఇతర ప్రాంతాల నుంచి నగరంలోకి వస్తుంటాయి. అయినా వాహనాల సగటు వేగం వేగం గంటకు 17-18 కిలోమీటర్ల నుంచి 24-25 కి.మీ.కు పెరిగిందని సీపీ తెలిపారు. భవిష్యత్‌లో ఈ వేగాన్ని గంటకు 27-28 కి.మీ.కు పెంచడానికి ప్రజల సహకారం అవసరం అన్నారు.
Hyderabad Traffic | హైదరాబాద్‌లోనే అధికం
దేశంలోని ఇతర మెట్రో నగరాలతో పోలిస్తే హైదరాబాద్(Hyderabad)లోనే సగటు వేగం ఎక్కువని సీపీ ఆనంద్ తెలిపారు. కోల్‌కతాలో 16.67 కి.మీ, ఢిల్లీలో 17.37, ముంబై 18.07, బెంగళూరు 18.47, చెన్నైలో గంటకు 20 కిలో మీటర్ల సగటు వేగంగా ఉండగా.. హైదరాబాద్ 23.40 కి.మీ సగటు వేగంతో టాప్‌లో ఉంది.
Hyderabad Traffic | వేగం పెరగడానికి కారణాలు
హైదరాబాద్ నగరంలో పోలీసులు చేపట్టిన పలు చర్యలతో సగటు వేగం పెరిందని సీపీ తెలిపారు. ప్రధానంగా ఆక్రమణల తొలగింపు ఉపయోగపడిందని ఆయన పేర్కొన్నారు. ఆపరేషన్ రోప్ (అబ్స్ట్రక్టివ్ పార్కింగ్, ఆక్రమణల తొలగింపు), మెరుగైన VVIP కాన్వాయ్ నిర్వహణ, హైరైజ్ కెమెరాలు డ్రోన్ నిఘా ద్వారా మెరుగైన రద్దీ నిర్వహణ లాంటి చర్యలతో వాహనాల వేగం పెరిగిందన్నారు. అంతేగాకుండా ట్రాఫిక్‌ను నియంత్రించడానికి చెట్లు / నిర్మాణాల వంటి అడ్డంకుల తొలగించామన్నారు. నగరంలో ట్రాఫిక్ నియంత్రణకు భవిష్యత్‌లో మరిన్ని చర్యలు చేపడుతామని CV ఆనంద్ వివరించారు. ప్రైవేట్ సంస్థలు CSR కింద ట్రాఫిక్ మార్షల్స్(Traffic marshals)ను నియమించుకోవాలని సూచించారు. ట్రాఫిక్ ను క్రమబద్ధీకరించడానికి సాంకేతిక ఆధారిత వ్యవస్థలను మరింతగా అమలు చేస్తామన్నారు.