అక్షరటుడే, గాంధారి : Gandhari Mandal | గాంధారి మండలంలోని ముదెల్లి గ్రామంలో (Mudelli Village) జరిగిన దాడి ఘటనకు రాజకీయాలతో సంబంధంలేదని కాంగ్రెస్ మండల అధ్యక్షుడు శ్రీనివాస్ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ముదెల్లి గ్రామంలో వరుసకు మామ అల్లుళ్లయిన వారి మధ్య జరిగిన మాట పట్టింపు విషయంలో యువకుడిపై మద్యం మత్తులో దాడి జరిగిన విషయం తెలిసిందే.
అయితే ఈ ఘటన కేవలం సంబంధిత కుటుంబానికి సంబంధించిన అంతర్గత విషయమని పేర్కొన్నారు. ఈ ఘటనకు కాంగ్రెస్ పార్టీకి (Congress Party), ఇతర పార్టీలకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో (Social Media) తప్పుడు ప్రచారాలు చేయవద్దని కోరారు. దాడి ఘటనపై సోషల్ మీడియాలో జరుగుతున్న తప్పుడు ప్రచారాలను కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుందని పేర్కొన్నారు. గ్రామ ప్రజలు ఎవరూ వదంతులు నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు.