అక్షరటుడే, వెబ్‌డెస్క్: Harish Rao | కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వ్యవస్థలను భ్రష్టు పట్టించిందని మాజీ మంత్రి హరీశ్‌రావు (Former Minister Harish Rao) విమర్శించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు.
అసెంబ్లీ సమావేశాలు (Assembly sessions) సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. అయితే సభ ఎన్ని రోజులు నిర్వహిస్తామని ప్రభుత్వం ఇంకా ప్రకటించలేదు. బీఏసీలో చర్చించి చెబుతామని తెలిపింది. దీనిపై హరీశ్‌రావు స్పందించారు. కనీసం 15 రోజులు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ హయాంలో 2014 నుంచి 2019 వరకు ఎక్కువ రోజులు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించినట్లు తెలిపారు. దాదాపు ఒక సెషన్ 32 రోజులు సమావేశాలు పెట్టామని వెల్లడించారు.
Harish Rao | 40 రోజులు..
కాంగ్రెస్ ప్రభుత్వం (Congress government) ఏర్పడి రెండేళ్లు అవుతున్నా.. మొత్తంగా రేపటితో 40 రోజులు మాత్రమే అసెంబ్లీ జరిపిందన్నారు. ప్రతిపక్షాల మీద బురదజల్లే కార్యక్రమం కోసమే సభ నిర్వహిస్తున్నారని మండిపడ్డారు. సభను 15 రోజులు కచ్చితంగా నడపాలన్నారు. తాము ప్రిపేర్ అయ్యి వస్తున్నాం.. ఉత్తమ్ లాగా మేము ప్రిపేర్ కాకుండా రామనియ ఎద్దేవా చేశారు. గతంలో కాళేశ్వరం విషయంలో కేసీఆర్ మాట్లాడుతుంటే ప్రిపేర్ అయ్యి రాలేదు అని ఉత్తమ్ అన్నారని చెప్పారు. కానీ తాను ఘోష్ కమిషన్‌పై మాట్లాడుతుంటే ఏడుగురు మంత్రులు అడ్డుపడ్డారని తెలిపారు.
సభ జరిపిందేకు తాము ఇచ్చిన అజెండాను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోలేదని హరీశ్‌రావు అన్నారు. ఎన్ని రోజులైనా సభ జరుపుతామని చెప్పే సీఎం రేవంత్‌రెడ్డి చివరికి ఒక్క రోజుతో ముగిస్తారని పేర్కొన్నారు. అసెంబ్లీలో ఒక్క హౌస్ కమిటీ వేయలేదని, శాసనసభా వ్యవహారాల మంత్రి శ్రీధర్‌బాబు విఫలమయ్యారని ఆయన విమర్శించారు.