అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Assembly Sessions | తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy), మాజీ సీఎం కేసీఆర్ సమావేశాలకు హాజరు అయ్యారు.అసెంబ్లీ సమావేశాలకు మాజీ సీఎం కేసీఆర్ హాజరయ్యారు. అయితే ఆయన రెండు నిమిషాలు మాత్రమే సభలో ఉండి వెళ్లిపోయారు. అసెంబ్లీ రిజిస్టర్లో సంతకం చేసి నందినగర్‌లోని తన నివాసానికి వెళ్లారు.
Assembly Sessions | కరచాలనం చేసిన సీఎం
ప్రతిపక్ష నేత కేసీఆర్ (Former CM KCR)తో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కరచాలనం చేశారు. కేసీఆర్ వద్దకు వచ్చి మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సీతక్క, వాకిటి శ్రీహరి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ప్రభత్వ విప్‌లు బీర్ల ఐలయ్య, ఆది శ్రీనివాస్ పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు (Congress MLAs), సీపీఐ ఎమ్మెల్యే కునమనేని సాంబశివరావు మర్యాదపూర్వకంగా కలిశారు. అయితే కేసీఆర్ సమావేశాల్లో పాల్గొంటారని అంతా భావించారు. కానీ ఆయన రెండు నిమిషాల్లో వెళ్లిపోవడం గమనార్హం.
Assembly Sessions | నాయకులకు సంతాపం
సభ ప్రారంభం కాగానే ఇటీవల మృతి చెందిన మాజీ ఎమ్మెల్యేలకు సంతాపం తెలిపారు. సంతాప తీర్మానాలు ప్రవేశ పెట్టారు. జీరో అవర్‌లో పలు అంశాలపై చర్చించారు. ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, కాటిపల్లి వెంకటరమణరెడ్డి, మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడారు. బీఏసీలో సభ పని దినాలపై నిర్ణయం తీసుకోనున్నారు. పలు బిల్లులను ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశ పెట్టనుంది.
Assembly Sessions | మాజీ సర్పంచుల అరెస్ట్..
పెండింగ్ బిల్లులు విడుదల చేయాలంటూ తెలంగాణ అసెంబ్లీ (Telangana Assembly) ముందు మాజీ సర్పంచులు ఆందోళన చేపట్టారు. వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. మాజీ సర్పంచ్‌లకు రూ. 531 కోట్ల బిల్లులు చెల్లించాల్సి ఉంది. దీంతో వారు పోరుబాట పట్టారు. ఈ క్రమంలో జిల్లాల్లో మాజీ సర్పంచులను ముందస్తుగానే అరెస్ట్ చేశారు. అయితే పలువురు అసెంబ్లీ వద్దకు రాగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.